News December 6, 2025

లొంగిపోయిన మావోయిస్టులకు ఆర్థిక సహాయం అందజేత

image

వెట్టి దుగ్ల, కిల్లో ఇందు, వంతాల గంగి గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేశారు. వీరు 2022-23లో అల్లూరి జిల్లా పోలీసుల ముందు లొంగిపోయారు. వీరికి ఆర్థిక సహాయం, పునరావాసం కల్పించడంలో భాగంగా మంజూరైన రూ.3 లక్షలను శనివారం పాడేరు SP కార్యాలయంలో అందించినట్లు SP అమిత్ బర్దార్ తెలిపారు. ఒక్కొక్కరికి రూ.1లక్ష చొప్పున ముగ్గురికి చెక్కులను అందజేశామన్నారు.

Similar News

News December 9, 2025

ప్రమాదంలో పద్మావతి అమ్మవారి ఆలయ పోటు కార్మికులు మృతి

image

నగరి పోలీస్ స్టేషన్ పరిధి తడకుపేట సమీపంలో రెండు కార్లు ఢీకొని <<18510891>>ముగ్గురు చనిపోయిన<<>> విషయం తెలిసిందే. మృుతల్లో ఇద్దరిని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో పని చేసే పోటు కార్మికులు శంకర్, సంతానంగా గుర్తించారు. వీరు తిరుత్తణికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుని వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇదే ప్రమాదంలో ఎదురుగా వచ్చిన కారులో వ్యక్తి సైతం మరణించాడు. పోలీసులు విచారణ చేపట్టారు.

News December 9, 2025

MDK: తొలి విడత పోరు.. ప్రచారానికి తెర నేడు.!

image

హోరా హోరీగా సాగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 5 గంటల తర్వాత తెర పడనుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ప్రచారానికి ఎక్కువ సమయం లేకపోవడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు తెల్లవారుజాము నుంచే ప్రచారం షురూ చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తొలి విడతలో SDPT జిల్లాలో 163 జీపీలు, 1432 వార్డులు, MDKలో 160 జీపీలు, 1402 వార్డులు, SRDలో 136 జీపీలు,1246 వార్డుల్లో ఎన్నికలు జరుగనున్నాయి.

News December 9, 2025

MBNR: స్థానిక ఎన్నికలు.. పలు పరీక్షలు వాయిదా

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 1,3,5 సెమిస్టర్ పరీక్షలను స్థానిక ఎన్నికల కారణంగా పలు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. వాయిదా పడిన పరీక్షలను 18 తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు గమనించాలని సూచించారు.