News November 26, 2025
వరంగల్ మార్కెట్లో మిర్చి ధరల వివరాలు

ఎనుమాముల మార్కెట్‌కి బుధవారం మిర్చి తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు నిన్న రూ.17,000 ధర రాగా.. బుధవారం రూ.17,100 అయింది. అలాగే, వండర్ హాట్(WH) మిర్చికి మంగళవారం రూ.19,500 ధర రాగా, ఈరోజు రూ.18,500 ధర వచ్చింది. మరోవైపు తేజ మిర్చికి నిన్న రూ.14,600 ధర వస్తే.. నేడు రూ.15,100 అయింది.
Similar News
News December 3, 2025
స్టేడియాల్లో సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉందా?

తమ ఆరాధ్య క్రికెటర్లను కలిసేందుకు ఫ్యాన్స్ వెర్రెత్తి పోతున్నారు. గ్రౌండ్లలోకి దూసుకెళ్లి ప్లేయర్ల కాళ్లపై పడుతున్నారు. మొన్న కోహ్లీ, నిన్న హార్దిక్‌పై ఫ్యాన్స్ విపరీత అభిమానం చూపారు. దీంతో జాతీయ స్థాయి ప్లేయర్లు ఆడే స్టేడియాల్లో సెక్యూరిటీపై క్రీడా వర్గాల నుంచి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇలా దూసుకొచ్చేవారి వల్ల ఆటగాళ్లకు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? అని నిలదీస్తున్నాయి. మీరేమంటారు?
News December 3, 2025
NLG: నేటి నుంచి మూడో విడత నామినేషన్లు

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడత నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. రెండో విడత MLG డివిజన్లో నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. మూడో విడత దేవరకొండ డివిజన్‌కు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 3న ఎన్నికల అధికారి విడుదల చేయనున్నారు. దేవరకొండ డివిజన్లోని 9 మండలాల్లో 269 గ్రామాలకు, 2,206 వార్డులకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
News December 3, 2025
యుద్ధానికి మేము సిద్ధం: పుతిన్

గతంలో చెప్పినట్లు యూరప్ దేశాలతో యుద్ధం చేయాలని రష్యా కోరుకోవట్లేదని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. ఒకవేళ తమపై పోరాటం చేస్తామంటే యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు. ఉక్రెయిన్ వార్ ముగించడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను ఆ దేశాలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. రష్యాకు ఆమోదయోగ్యంకాని ప్రతిపాదనలు తెచ్చి శాంతి ఒప్పందానికి తూట్లు పొడుస్తున్నాయన్నారు. వాటికి శాంతియుత ఎజెండా లేదని ఆరోపించారు.


