News September 18, 2025
వరంగల్: రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన

నగర వాసులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు వరంగల్ పోలీసులు తమ అధికారిక ఫేస్‌బుక్ పేజీ ద్వారా ప్రత్యేక సూచనలు జారీ చేశారు. వాటిలో రోడ్డు దాటే సమయంలో జిబ్రా క్రాసింగ్ తప్పనిసరిగా ఉపయోగించాలని, వాహనదారులు ట్రాఫిక్ సిగ్నల్‌లు కచ్చితంగా పాటించాలన్నారు. డ్రైవింగ్ సమయంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్లను ఉపయోగించొద్దని హెచ్చరించారు.
Similar News
News September 18, 2025
అనకాపల్లి: గ్యాస్ సబ్సిడీ నగదు జమ కాని వారికి గమనిక

గ్యాస్ సబ్సిడీ నగదు బ్యాంకు ఖాతాలో జమకాని లబ్ధిదారులు నేరుగా బ్యాంకు వద్దకు వెళ్లి బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ జాహ్నవి లబ్ధిదారులకు సూచించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దీపం -2 పథకంలో భాగంగా సబ్సిడీపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 805 మంది లబ్ధిదారులకు నగదు జమకాలేదని వారికి డీలర్లు తగిన సమాచారం ఇవ్వాలన్నారు.
News September 18, 2025
ఏలూరు: రెవెన్యూ ఉద్యోగుల బదిలీలు

ఏలూరు జిల్లాలో ఏడుగురు మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, నలుగురు సీనియర్ అసిస్టెంట్లకు బదిలీ ఉత్తర్వులను డీఆర్‌ఓ విశ్వేశ్వరయ్య జారీ చేశారు. కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాల మేరకు ఈ బదిలీలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. మూడు నుంచి ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి ఈ బదిలీలు వర్తిస్తాయని పేర్కొన్నారు.
News September 18, 2025
నిర్మల్: ‘మేదరులను ఎస్టీ జాబితాలో చేర్చాలి’

మేదరులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆ కుల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనరసయ్య అన్నారు. గురువారం పట్టణంలో ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మేదరులను ఆదుకునేందుకు మేదరి బంధు, ఇందిరమ్మ ఇళ్లు వెంటనే అందించాలని, జనాభా ప్రాతిపదికన ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ప్రకటించాలన్నారు. 55 సంవత్సరాలు నిండిన వారందరికీ పెన్షన్లను మంజూరు చేయాలని కోరారు.