News November 12, 2025
విజయవాడలో RTC బంపర్ ఆఫర్..!

విజయవాడ నగర ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు అర్ధరాత్రి వరకు చెల్లుబాటు అయ్యే ట్రావెల్ యాజ్ యూ లైక్ (TAYL) టికెట్ ఇకపై తీసుకున్న సమయం నుంచి 24 గంటల వరకు చెల్లుబాటు అవుతుంది. కేవలం రూ.100 చెల్లించి సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఎన్నిసార్లయినా ప్రయాణించవచ్చని జిల్లా ప్రజా రవాణా అధికారి దానం తెలిపారు.
Similar News
News November 12, 2025
కేయూ: 18 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు

కాకతీయ యూనివర్సిటీ (కేయూ) పరిధిలో బీఏ, బీకాం, బీఎస్సీ సహా ఇతర డిగ్రీ కోర్సుల 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 18 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వివరాలు కేయూ వెబ్‌సైట్‌లో ఉన్నాయన్నారు.
News November 12, 2025
‘ఫ్రీహోల్డ్’ రిజిస్ట్రేషన్లపై నిషేధం పొడిగింపు

AP: ఫ్రీహోల్డ్(యాజమాన్య హక్కుల కల్పన) భూముల రిజిస్ట్రేషన్లపై నిషేధాన్ని వచ్చే ఏడాది జనవరి 11 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వైసీపీ హయాంలో ఫ్రీహోల్డ్ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం భావిస్తోంది. వీటిపై విచారణకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఓ అంచనాకు రాలేకపోవడంతో గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు ఏడుసార్లు నిషేధాన్ని పొడిగించారు.