News December 9, 2025

విశాఖలో ఆయిల్ పామ్ సాగుకు 100% రాయితీ

image

విశాఖ జిల్లాలో 100 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉద్యాన అధికారిణి శ్యామల తెలిపారు. రైతులకు 100% రాయితీపై మొక్కలు, అంతర పంటల నిర్వహణకు రూ.21,000 సాయం, డ్రిప్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇది 30 ఏళ్ల పాటు స్థిరమైన ఆదాయం ఇస్తుందని, భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల రైతులు ఆర్‌బీకేల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Similar News

News December 9, 2025

కనకమహాలక్ష్మి ఆలయంలో మార్గశిర పూజలు

image

విశాఖ శ్రీ కనకమహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు జరుగుతుండగా.. మంగళవారం లక్ష్మీహోమం, పూర్ణాహుతి నిర్వహించారు. డిసెంబర్ 19 వరకు ఆర్జిత సేవలు రద్దు చేశారు. రూ.500 దర్శనం, ప్రసాదం కోసం వాట్సాప్ (9552300009) ద్వారా బుక్ చేసుకోవచ్చు. వృద్ధులు, గర్భిణులకు గురువారం తప్ప మిగతా రోజుల్లో మధ్యాహ్నం 2-3 గంటల వరకు దర్శనం కల్పిస్తున్నారు. వచ్చే గురువారం (డిసెంబర్ 11) రద్దీ దృష్ట్యా పూజా వేళలు కుదించారు.

News December 9, 2025

విశాఖలో సీఎం ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్

image

సీఎం చంద్రబాబు ఈనెల 12న విశాఖలో ప‌ర్య‌టించ‌నున్న నేప‌థ్యంలో సంబంధిత ఏర్పాట్ల‌ను కలెక్టర్‌ హరేంధిర ప్ర‌సాద్ మంగళవారం ప‌రిశీలించారు. మ‌ధురువాడ ఐటీ హిల్స్‌పై సంద‌ర్శించిన ఆయ‌న కాగ్నిజెంట్ కంపెనీకి శంకుస్థాప‌న చేయనున్న ప్రాంతంలో ఏర్పాట్లు ఎక్క‌డివ‌ర‌కు వ‌చ్చాయో అడిగి తెలుసుకున్నారు. సీఎం చేరుకోనున్న క్ర‌మంలో అక్క‌డి హెలిప్యాడ్‌ను ప‌రిశీలించారు. ఆయ‌న వెంట జేసీతో పాటు ఏపీఐఐసీ అధికారులు ఉన్నారు.

News December 9, 2025

విశాఖలో 16 అనధికార, నిర్మాణ భవనాల తొలగింపు

image

జీవీఎంసీ కమీషనర్ కేతన్ గార్గ్ ఆదేశాలో విశాఖలో ఆగస్టు 31 తర్వాత నిర్మించిన అనధికార భవనలను తొలగిస్తున్నట్ల జీవీఎంసీ ఛీప్ సిటీ ప్లానర్ ప్రభాకర్ రావు తెలిపారు. జోన్-2లో 3, జోన్-3లో 2, జోన్-4లో 3, జోన్-5లో 4, జోన్-6లో 3, జోన్-8లో ఒక నిర్మాణంతో కలిపి మొత్తం 16 అనధికార నిర్మాణాలను రెండు రోజుల నుంచి తొలగించినట్లు చెప్పారు. ప్రభుత్వం కల్పించిన బీపీఎస్‌ను వినియోగించుకోవాలన్నారు.