News November 14, 2025

విశాఖలో నేటి నుంచే CII సమ్మిట్

image

నేటి నుంచి జరుగనున్న CII సమ్మిట్‌కు AU ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ సిద్ధమైంది. ఇప్పటికే ప్రముఖులు నగరానికి చేరుకున్నారు. 2 రోజుల సమ్మిట్‌‌ను ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రారంభించనున్నారు. తొలిరోజు సదస్సులో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలను CM చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభిస్తారు. అనంతరం 25 సెషన్లలో వివిధ అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఈ సదస్సులో AP గవర్నర్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు.

Similar News

News November 14, 2025

జూబ్లీహిల్స్ కౌంటింగ్: షేక్‌పేట డివిజన్‌లో కాంగ్రెస్ లీడింగ్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో EVM ఓట్లను లెక్కిస్తున్నారు. తొలి రౌండ్‌లో కాంగ్రెస్ 47 ఓట్ల ఆధిక్యంలో ఉంది. షేక్‌పేట డివిజన్‌లో ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ లీడింగ్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌కు 8,911, BRSకు 8,864 ఓట్లు పోలయ్యాయి. అటు పోస్టల్ బ్యాలెట్‌లోనూ కాంగ్రెస్‌కు ఆధిక్యం వచ్చింది. ఇక్కడ ముస్లిం ఓట్లు అధికంగా ఉండగా.. 11న పోలింగ్ రోజు సాయంత్రం BRS-కాంగ్రెస్ ఇక్కడ దొంగ ఓట్లపై ఆరోపణలు చేసుకున్నాయి.

News November 14, 2025

బిహార్‌లో 2 చోట్ల MIM ఆధిక్యం

image

దేశమంతా ఆసక్తిగా చూస్తున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఎర్లీ ట్రెండ్స్ BJPకి అనుకూలంగా ఉన్నాయి. NDA 66 స్థానాల్లో లీడింగ్‌లో ఉండగా ఇందులో BJPవి 40, JDU 24 స్థానాలు. ఇక MGB 44 చోట్ల లీడ్ ప్రదర్శిస్తుండగా వీటిలో RJD-35, కాంగ్రెస్-7 ఉన్నాయి. ఇక ఏ కూటమిలో లేని AIMIM 2 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఆమౌర్‌లో 2020లో గెలిచిన ఆ పార్టీ అభ్యర్థి అక్తారుల్ ఇమాన్ ఈసారీ లీడ్‌లో ఉన్నారు.

News November 14, 2025

జూబ్లీహిల్స్ బై పోల్: అనుమానం వచ్చి ఫిర్యాదు చేస్తేనే VVPAT లెక్కింపు

image

మనం ఓటు వేసినపుడు ఓ స్లిప్ మనం ఎవరికి ఓటు వేశామో మనకు చూపించి ఆ తరువాత ఒక డబ్బాలో పడిపోతుంది. దానినే VVPAT అంటారు. ఆ స్లిప్పులను కౌంటింగ్ సమయంలో లెక్కించరు. అయితే పోలింగ్ శాతానికి, ఓట్లకూ లెక్క సరిపోవాలి. అలా కానిపక్షంలో ఏజెంట్లు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తారు. అప్పుడు ఆర్ఓతోపాటు సూపర్ వైజర్ VVPAT (Voter Verifiable Paper Audit Trail)  ఓట్లను లెక్కిస్తారు.