News December 9, 2025
విశాఖలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

సీఎం చంద్రబాబు ఈనెల 12న విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మంగళవారం పరిశీలించారు. మధురువాడ ఐటీ హిల్స్‌పై సందర్శించిన ఆయన కాగ్నిజెంట్ కంపెనీకి శంకుస్థాపన చేయనున్న ప్రాంతంలో ఏర్పాట్లు ఎక్కడివరకు వచ్చాయో అడిగి తెలుసుకున్నారు. సీఎం చేరుకోనున్న క్రమంలో అక్కడి హెలిప్యాడ్‌ను పరిశీలించారు. ఆయన వెంట జేసీతో పాటు ఏపీఐఐసీ అధికారులు ఉన్నారు.
Similar News
News December 9, 2025
ఏపీ ఈపీడీసీఎల్ ఎస్సీ, ఎస్టీ సంఘం నూతన కమిటీ ఎన్నిక

ఏపీ ఈపీడీసీఎల్ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం డిస్కం నూతన కమిటీని విశాఖలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా సిహెచ్.సాయిబాబు, అధ్యక్షుడిగా ఎం.నిరంజన్ బాబు, జనరల్ సెక్రటరీగా ఎన్.వెంకటరావు ఎన్నికయ్యారు. మెజారిటీ సభ్యుల ఆమోదంతో ఏర్పాటైన ఈ కమిటీ మూడేళ్లు కొనసాగుతుందని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సాయిబాబు తెలిపారు.
News December 9, 2025
మహిళా పోలీసులకు కొత్త బాధ్యతలు: విశాఖ సీపీ

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి 430 మంది మహిళా పోలీసులతో మంగళవారం సమావేశయ్యారు. ఈ కార్యక్రమంలో వారి విధులను ఖరారు చేశారు. ఇకపై రెగ్యులర్ పోలీసులతో కలిసి పనిచేసేలా డేటా ఎంట్రీ, దర్యాప్తు సాయం, కౌన్సెలింగ్, సమాచార సేకరణ వంటి 10 రకాల కీలక బాధ్యతలను వారికి ప్రతిపాదించారు. బదిలీలు, ఐడీ కార్డుల సమస్యలను పరిష్కరిస్తామని సీపీ హామీ ఇచ్చారు.
News December 9, 2025
విశాఖలో జాతీయ రోలర్ స్కేటింగ్ పోటీలు ప్రారంభం

విశాఖ వేదికగా 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌ను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మంగళవారం అట్టహాసంగా ప్రారంభించారు. ఒలింపిక్స్ పతకాలే లక్ష్యంగా క్రీడాకారులు రాణించాలని ఆయన పిలుపునిచ్చారు. ముడసర్లోవలో కొత్త స్కేటింగ్ రింక్ నిర్మిస్తామని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ఎమ్మెల్యేలు పాల్గొనగా, అంతర్జాతీయ స్కేటర్ ఆనంద్ కుమార్‌ను ఘనంగా సత్కరించారు.


