News November 12, 2025
శబరిమలకు కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్లు

అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం కాజీపేట జంక్షన్ మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఏ. శ్రీధర్ తెలిపారు. ఈ నెల 24న చర్లపల్లి-కొట్టాయం (07115), 25న కొట్టాయం-చర్లపల్లి (07116) ఎక్స్‌ప్రెస్‌లు కాజీపేటకు చేరుకుంటాయి. ఈ రైళ్లు వరంగల్, ఖమ్మం, విజయవాడ తదితర స్టేషన్లలో ఆగుతాయి.
Similar News
News November 12, 2025
హీరోగా మారిన డైరెక్టర్.. రూ.30 కోట్ల రెమ్యునరేషన్?

<<18171965>>హీరో అవతారమెత్తిన<<>> కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ సరికొత్త ఘనత సాధించినట్లు టాక్. దర్శకుడిగా ₹50Cr రెమ్యునరేషన్ తీసుకున్న ఆయన.. కథానాయకుడిగా తొలి మూవీకే ₹30Cr వరకు అందుకుంటున్నట్లు సమాచారం. ఇదొక రికార్డని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. లోకేశ్ ప్రధాన పాత్రలో ‘DC’ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. కాగా ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో, కూలీ చిత్రాలతో ఆయన స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన విషయం తెలిసిందే.
News November 12, 2025
శ్రీకాకుళం: 13 నుంచి పదవ తరగతి ఫీజు చెల్లింపునకు అవకాశం

పదవ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫీజును ఈనెల 13 నుంచి 25 వరకు చెల్లించవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రవిబాబు చెప్పారు. జిల్లాలోని 450 ప్రభుత్వ, 196 ప్రైవేట్ పాఠశాలల్లో 22,890 మంది విద్యార్థులు పదవ తరగతి చదువుతున్నారని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు సమాచారం అందించాలని చెప్పారు. గడువు దాటితే అపరాధ రుసుంతో ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
News November 12, 2025
పాలమూరు: డిగ్రీ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ పొడిగింపు

PU పరిధిలోని డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ (రెగ్యులర్, బ్యాక్‌లాగ్) ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు పొడిగించారు. వాస్తవానికి నేటితో ముగియాల్సిన పరీక్షలను ఈ నెల 16 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ అనుబంధ కళాశాలలన్నీ ఈ గడువును వినియోగించుకోవాలని సూచించారు. పూర్తి వివరాలను విద్యార్థులు www.palamuruuniversity.com వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు.


