News February 27, 2025
శ్రీశైలంలో నేడు రథోత్సవం, తెప్పోత్సవం

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు శ్రీశైలంలో రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3.30గంటలకు రథాంగదేవతా పూజ, రథాంగదేవతా హోమం, రథాంగ దేవతా బలిసమర్పణ, సాయంత్రం 5 గంటలకు రథోత్సవం, సాయంత్రం 6 గంటలకు సాయంకాలార్చనలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, సాయంకాల హోమాలు, రాత్రి 8 గంటలకుతెప్పోత్సవం కార్యక్రమాలను నిర్వహిస్తారు.
Similar News
News February 27, 2025
#WeStandWithPosani అంటున్న వైసీపీ శ్రేణులు

AP: కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. పోసాని కృష్ణమురళి అరెస్టును ఖండిస్తూ #WeStandWithPosani అని కార్యకర్తలు ట్వీట్లు చేస్తున్నారు. గతంలో సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారిని అరెస్టు చేశారని, ఇప్పుడు నాయకులను టార్గెట్ చేశారని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం వైసీపీ నేతలపై కాకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.
News February 27, 2025
సిరిసిల్లలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఓటింగ్

సిరిసిల్ల జిల్లాలో ఎమ్మెల్సీ ఓటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఈరోజు ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. మొత్తం జిల్లాలో ఇప్పటికే అధికారులు 41 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 23,347 పట్టభద్రులు ఉన్నారు.
News February 27, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పోలింగ్ ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గీతా నగర్‌లో ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా ఉన్నతాధికారులు ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరిగేందుకు పటిష్ఠ బందోబస్తు భద్రతను ఏర్పాటుచేశారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లు తమ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.