News November 14, 2025
సంగారెడ్డి: అన్నం గిన్నెలో కాలు పెట్టిన వాచ్‌మన్‌పై వేటు

సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట పాలిటెక్నిక్ కళాశాల ఎస్సీ, ఎస్టీ వసతి గృహం వాచ్‌మెన్ దారుణానికి పాల్పడ్డాడు. వసతి గృహంలో విధులు నిర్వహిస్తున్న వాచ్‌మన్ శేఖర్ అన్నం గిన్నెలో మద్యం తాగి కాలు పెట్టాడు. ఫిర్యాదుల మేరకు కళాశాల ప్రిన్సిపల్ నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అతడిని సస్పెండ్ చేసినట్లు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ గురువారం తెలిపారు.
Similar News
News November 14, 2025
ప్రతిరోజూ ABC జ్యూస్ తాగితే జరిగేది ఇదే

ABC జ్యూస్.. యాపిల్, బీట్‌రూట్, క్యారెట్‌తో తయారు చేస్తారు. షుగర్, విటమిన్లు, ఖనిజాలు, 0.5గ్రా. ప్రొటీన్స్ లభించే ఈ జ్యూస్ తాగితే రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. పరగడుపున తాగితే శరీరంలో వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. ముఖం యంగ్‌గా కనిపిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కేలరీలు తక్కువ ఉన్నందున బరువు తగ్గుతారు. 100మి.లీ జ్యూస్‌లో 45-50 కేలరీలు, 10-12గ్రా. కార్బోహైడ్రేట్లు బాడీకి అందుతాయి.
News November 14, 2025
కొడంగల్: శారీరక దృఢత్వానికి కలరిపయట్టు దోహదం..!

కొడంగల్ పరిధి హస్నాబాద్‌లో మూడు రోజులుగా కలరిపయట్టు శిక్షణ కొనసాగుతోంది. ఇటివలే గ్రామానికి వచ్చిన సినీ నటుడు ప్రభాకర్ గ్రామ పంచాయతీ ఆవరణలో కొనసాగుతున్న శిక్షణలో శిక్షకులతో ముచ్చటించారు. కలరిపయట్టు విద్య నేర్చుకోవడంతో శారీరక దృఢత్వం, మానసిక ఏకాగ్రత లాంటి అంశాలపై దృష్టి సారించవచ్చన్నారు. కలరిపయట్టు అనేది కేరళలో ఉద్భవించిన ఒక పురాతన భారతీయ యుద్ధ కళ అని శిక్షకుడు రమేశ్ వివరించారు.
News November 14, 2025
పెరగనున్న ఇంజినీరింగ్ కోర్సుల ఫీజులు!

TG: రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సులకు ఫీజులు పెరిగే అవకాశం ఉంది. ఇవాళ లేదా రేపు కొత్త ఫీజులకు సంబంధించిన జీవో రానున్నట్లు తెలుస్తోంది. 2025-27 పీరియడ్‌కు సంబంధించి కొత్త ఫీజుల ప్రతిపాదలను టీఏఎఫ్ఆర్సీ ప్రభుత్వానికి పంపగా ఇప్పటికే ఫైనల్ చేసినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉండటంతో జీవో నిలిచిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈసీ అనుమతితో విడుదల చేయనుంది.


