News November 1, 2025

సంగారెడ్డి: ‘ఈనెల 14 లోగా ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించాలి’

image

ఇంటర్ ఫైనల్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు ప్రకటించిందని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ తెలిపారు. నేటి నుంచి ఈనెల 14 లోపు కళాశాలలో విద్యార్థులు ఫీజు చెల్లించాలని తెలిపారు. రూ.100 ఫైన్‌తో ఈనెల 24 వరకు, రూ.500 ఫైన్‌తో డిసెంబర్ 1 వరకు, రూ.2000 ఫైన్‌తో డిసెంబర్ 15 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.

Similar News

News November 2, 2025

MDK: అడవిలో అందాల విడిది.. నర్సాపూర్ ఎకో పార్క్

image

చుట్టూ దట్టమైన అడవి, పచ్చని చెట్లు, పక్షుల కిలకిలరావాలు. నీటిపై తేలియాడే కాటేజీలు, స్విమ్మింగ్ పూల్స్. కనువిందు చేసే ఈ సుందర దృశ్యలు మరెక్కడో కాదండోయ్ మన నర్సాపూర్‌‌లోనే. ఇక్కడి ఫారెస్టులో ఏర్పాటు చేసిన<<18172075>> ఎకో పార్క్‌<<>>ను రూ.3 కోట్లతో అభివృద్ధి చేసి శనివారం ప్రారంభించారు. ఇక్కడ ఆధునిక హంగులతో ఉన్న ఏర్పాట్లు ప్రకృతి ప్రేమికులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. రాత్రంతా అక్కడే బస చేయవచ్చు.
-SHARE IT

News November 2, 2025

KG చికెన్ ధర ఎంతంటే?

image

తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసంలోనూ చికెన్ ధరలు తగ్గట్లేదు. హైదరాబాద్‌లో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.210-250, కామారెడ్డిలో రూ.260, ఉమ్మడి ఖమ్మంలో రూ.210-240, విజయవాడలో రూ.250, ఏలూరులో రూ.220, విశాఖలో రూ.260గా ఉన్నాయి. కార్తీక మాసం అయినప్పటికీ ఆదివారం కావడంతో పలు ప్రాంతాల్లో ధరలు పెరిగాయి. మీ ఏరియాలో రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.

News November 2, 2025

GDWL: ఆహారం విషయంలో అలసత్వం వద్దు: జాయింట్ కలెక్టర్

image

విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలని, ఆహారం విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ నరసింగరావు హెచ్చరించారు. కాగా, ఎర్రవల్లిలో ఎస్సీ బాలుర గురుకులంలో శనివారం జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో పలువురు విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని, ఆహారం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా వ్యవహరించాలని పాఠశాల సిబ్బందికి గట్టి వార్నింగ్ ఇచ్చారు.