News November 14, 2025
సంగారెడ్డి: జిల్లా వైద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన వసంతరావు

సంగారెడ్డి జిల్లా వైద్య అధికారిగా డాక్టర్ వసంత రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇన్‌ఛార్జ్ వైద్యాధికారిగా ఉన్న డాక్టర్ నాగ నిర్మల నుంచి బాధ్యతలు తీసుకున్నారు. డాక్టర్ వసంతరావు మాట్లాడుతూ.. జిల్లాలో ఆరోగ్య శాఖను బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేలా చూస్తానని చెప్పారు.
Similar News
News November 14, 2025
GNT: ‘నెలాఖరు లోపు స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోవాలి’

స్మార్ట్ రేషన్ కార్డులను ఈ నెలాఖరులోపు పొందాలని జిల్లా పౌర సరఫరాల అధికారి పి. కోమలి పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను సెప్టెంబరు 1 నుంచి సచివాలయాల సిబ్బంది, రేషన్ షాపు డీలర్ల ద్వారా ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు 5,36,406 కార్డుదారులకు పంపిణీ పూర్తి అయిందన్నారు. 49,209 కార్డులు పంపిణీ కాకుండా సచివాలయాల వద్ద మిగిలి ఉన్నాయని, లబ్ధిదారులు కార్డులు తీసుకోవాలన్నారు
News November 14, 2025
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించని ఏజెన్సీలు, సక్రమంగా పర్యవేక్షించని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెట్రి సెల్వి హెచ్చరించారు. పాఠశాలలు, వసతి గృహాలలో భోజన పథకం అమలుపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం సమీక్షించారు. విద్యార్థుల్లో పౌష్టికాహార లోపం లేకుండా ఉండేలా మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందజేయాలని సూచించారు.
News November 14, 2025
సుపరిపాలన, అభివృద్ధి విజయమిది: మోదీ

బిహార్ ఎన్నికల్లో విజయంపై PM మోదీ స్పందించారు. ‘సుపరిపాలన, అభివృద్ధి, ప్రజానుకూల స్ఫూర్తి, సామాజిక న్యాయం గెలిచింది. చరిత్రాత్మక, అసమాన గెలుపుతో NDAను ఆశీర్వదించిన బిహార్ ప్రజలకు కృతజ్ఞతలు. ప్రజలకు సేవ చేసేందుకు, బిహార్ కోసం పని చేసేందుకు ఈ తీర్పు మాకు మరింత బలాన్నిచ్చింది’ అని ట్వీట్ చేశారు. తమ ట్రాక్ రికార్డు, రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలనే తమ విజన్ ఆధారంగా ప్రజలు ఓటేశారని తెలిపారు.


