News November 14, 2025
సంగారెడ్డి: నేటి నుంచి గ్రంథాలయ వారోత్సవాలు

సంగారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నేటి (శుక్రవారం) నుంచి నవంబర్ 20వ తేదీ వరకు 58వ గ్రంథాలయ వారోత్సవాలు జరగనున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య తెలిపారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో ప్రతిరోజు ఒక్కో ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. విలువైన కార్యక్రమాలను సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
Similar News
News November 14, 2025
విద్యాసాగర్ రావు కృషి అసామాన్యం: హరీశ్ రావు

సాగునీటి రంగ నిపుణులు ఆర్. విద్యాసాగర్ రావు జయంతిని పురస్కరించుకుని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర నీటి హక్కుల కోసం ‘నీళ్ల సారు’ విద్యాసాగర్ రావు అసామాన్యమైన కృషి చేశారని ఆయన కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన జల దోపిడీని, తెలంగాణకు జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించి, చైతన్యపరచడంలో విద్యాసాగర్ రావు సేవలు మరువలేనివని హరీశ్ రావు తెలిపారు.
News November 14, 2025
WTC ఫైనల్‌లో టాస్ గెలుస్తాం: గిల్

టెస్టుల్లో మరోసారి టాస్ ఓడిపోవడంపై టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫన్నీగా స్పందించారు. SAతో తొలి టెస్టులో టాస్ ఓడిన అనంతరం ‘నేను టాస్ గెలవబోయే ఏకైక మ్యాచ్ WTC ఫైనలే కావొచ్చు’ అని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఆయన 8 టెస్టులకు కెప్టెన్సీ చేయగా, 7 మ్యాచుల్లో టాస్ ఓడారు. అటు సౌతాఫ్రికా 2015 తర్వాత భారత్ గడ్డపై టెస్టుల్లో తొలిసారి టాస్ గెలిచింది. ప్రస్తుతం SA ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు 66/2గా ఉంది.
News November 14, 2025
WGL: గృహజ్యోతి లబ్ధిదారుడికి రూ.1,34,517 బిల్లు

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామానికి చెందిన గృహజ్యోతి లబ్ధిదారుడు దేవేందర్ రావుకు ఒక్కసారిగా రూ.1,34,517 విద్యుత్ బిల్లు రావడంతో కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. గతంలో మీటర్‌లో సమస్య ఉందని, విద్యుత్ సిబ్బంది పరీక్షించి ఎలాంటి లోపం లేదని చెప్పి తిరిగి బిగించి వెళ్లారు. ఇప్పుడు మళ్లీ భారీగా బిల్లు రావడంతో మీటర్‌ను మళ్లీ టెస్టింగ్‌కు పంపిస్తామని చెబుతున్నారు.


