News November 14, 2025
సంబంధం లేని వ్యక్తులు CID విచారణలో: భూమన

CIDకి సంబంధం లేని వ్యక్తి తిరుమల <<18287141>>పరకామణి <<>>కేసు విచారణ చేపడుతున్నారని భూమన ఆరోపించారు. ‘లక్ష్మణరావు అనే వ్యక్తి విచారణ పేరుతో సతీశ్‌ను బండబూతులు తిట్టాడు. సీఐడీలో భాగస్వామి కానీ వ్యక్తి విచారణలో ఏవిధంగా పాల్గొంటారు. న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా సీఐడీ అధికారులు విచారణ చేస్తున్నారు’ అని భూమన విమర్శించారు.
Similar News
News November 14, 2025
గద్వాల్: దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలి: కలెక్టర్

భూభారతి, సాదాబైనామా, తదితర భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ సంతోష్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల సందర్భంగా 6391 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు.
News November 14, 2025
కోనసీమ: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలుశిక్ష

బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి జైలుశిక్ష పడింది. కోనసీమ ఎస్పీ రాహుల్ మీనా వివరాల మేరకు.. అయినవిల్లి లంకకు చెందిన ముత్తబత్తుల సతీశ్ 2018 ఆగస్ట్ 7న 15 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులకు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదైంది. నేరం నిరూపణ కావడంతో సతీశ్‌కు 20ఏళ్ల జైలుశిక్ష, రూ.5వేలు జరిమానా విధిస్తూ కాకినాడ పోక్సో కోర్టు జడ్జి K.శ్రీదేవి తీర్పు చెప్పారు.
News November 14, 2025
పదో తరగతిలో 100% ఉత్తీర్ణతే లక్ష్యం: నంద్యాల కలెక్టర్

నంద్యాల జిల్లాలో పదో తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులతో ఆమె సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల అధ్యయన పద్ధతులు, బోధనా ప్రమాణాల మెరుగుదలపై కలెక్టర్ మార్గదర్శకాలు ఇచ్చారు.


