News November 14, 2025
సాక్షి మృతి.. అదే ఫార్ములా రిపీట్: TDP

TTD మాజీ AVSO సతీశ్ మృతిపై TDP చేసిన వరుస ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ‘కేసులో సాక్షి గల్లంతైతే నేర నిరూపితం కష్టమే. అందుకేనేమో కేసు కొలిక్కి వస్తుందనుకున్న టైంలో సాక్షి చచ్చిపోతాడు. పరిటాల రవి కేసు నుంచి పరకామణి కేసు వరకు అదే ఫార్ములా రిపీట్. నాడు బాబాయ్ వివేకానంద రెడ్డిపై గొడ్డలి వేటు వేసి గుండెపోటు అని, నేడు మాజీ AVSOని చంపేసి బలవన్మరణం అని YCP ప్రచారం చేస్తోంది’ అని TDP ఆరోపించింది.
Similar News
News November 15, 2025
లిక్కర్ స్కాం నిందితుడు అరెస్ట్.. విజయవాడకు తరలింపు

రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన అనిల్ చోకర్ను లిక్కర్ స్కాం కేసులో సిట్ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఇతడిని 49వ నిందితుడిగా పేర్కొన్నారు. అనిల్ చోకర్ ముంబైలో సెల్ కంపెనీలు సృష్టించి, లిక్కర్ స్కాం ద్వారా అక్రమంగా సంపాదించిన బ్లాక్ మనీని వైట్‌గా మార్చాడని సిట్ అభియోగం మోపింది. నిందితుడిని నిన్న ముంబైలో అరెస్టు చేసి, స్థానిక ఏసీబీ కోర్టులో హాజరుపరిచేందుకు శుక్రవారం విజయవాడకు తరలించారు.
News November 15, 2025
ఇవి సర్‌ప్రైజ్ రిజల్ట్స్: రాహుల్ గాంధీ

బిహార్ అసెంబ్లీ ఫలితాలు ఆశ్చర్యపరిచాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల ప్రక్రియలో మొదటి నుంచీ అన్యాయం జరిగిందని, అందుకే తాము విజయం సాధించలేకపోయామని చెప్పారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే పోరాటం చేస్తున్నట్లు వివరించారు. ఓటమిపై కాంగ్రెస్, ఇండియా కూటమి లోతుగా సమీక్షించుకుని, మరింత బలంగా తిరిగివస్తామని పేర్కొన్నారు.
News November 15, 2025
నల్గొండ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

NLG : డీసీసీబీలో సహకార వారోత్సవాలు
మిర్యాలగూడ: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
NLG : చదువే ధ్యేయంగా బాలికలు ముందుకు సాగాలి
NLG : వెటర్నరీ ఆసుపత్రిలో మందుల కొరత
NLG : చేప పిల్లలు నాసిరకం: మత్స్యకారులు
NLG : 17 నుంచి పత్తి కొనుగోళ్లు బంద్
NLG : పోస్ట్ ఆఫీస్ పని వేళల్లో మార్పులు
NLG : యాసంగి ప్రణాళిక @ 6,57,229 ఎకరాలు
చిట్యాల : నల్లగొండ పోలీసుల సూపర్


