News November 12, 2025
సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం రూ.1.95కోట్లు

సింహాద్రి అప్పన్నకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలను ఆలయ అధికారులు బుధవారం లెక్కించారు. ఈఓ సుజాత పర్యవేక్షణలో ఈ లెక్కింపు ప్రక్రియ జరిగింది. 28 రోజులకుగాను మొత్తం రూ.1,95,27,442 ఆదాయం వచ్చింది. బంగారం 83 గ్రా.100 మిల్లీగ్రాములు, వెండి 11 కిలోల 200 గ్రా, 17 దేశాల విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, సేవా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
Similar News
News November 13, 2025
HYD: చెరువుల అభివృద్ధి అంటే అందాలు అద్దడం కాదు

చెరువుల అభివృద్ధి అంటే అందాలు అద్దడం ఒక్కటే కాదని.. దాని అవసరాలు నెరవేరే విధంగా వాటిని తీర్చాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. శిల్పకళా వేదికలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నిర్వహించిన సౌత్ ఇండియా CSR సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. CSR నిధులు పూర్తిస్థాయిలో సద్వినియోగం అయ్యేలా ఆయా సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News November 13, 2025
ఢిల్లీ పేలుడు: 300 కిలోల అమ్మోనియం నైట్రేట్ ఎక్కడ?

టెర్రరిస్టులు బంగ్లాదేశ్, నేపాల్ మీదుగా పేలుడు పదార్థాలను దేశంలోకి తీసుకొచ్చినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. 3,200KGs <<18254431>>అమ్మోనియం నైట్రేట్<<>> కన్‌సైన్మెంట్ రాగా, అందులో 2,900KGs స్వాధీనం చేసుకున్నారు. మరో 300KGs దొరకలేదు. అది ఎక్కడుందో తెలుసుకునేందుకు అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. మరోవైపు బాబ్రీ మసీదును కూల్చిన రోజు(DEC 6) దేశవ్యాప్తంగా దాడులకు ఉమర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
News November 12, 2025
ఏలూరు: గ్రంథాలయ భవనాన్ని తనిఖీ చేసిన జేసీ

ఏలూరులో జిల్లా గ్రంథాలయ సంస్థ భవనాన్ని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో మాట్లాడి, శిథిలావస్థలో ఉన్న భవన పరిస్థితిని పరిశీలించారు. గ్రంథాలయ నిర్వహణకు అనుకూలమైన వసతి అంశాన్ని త్వరలోనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని, సేవలను విస్తృత పరిచేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.


