News November 26, 2025
సిద్దిపేట: ఎన్నికల్లో ఉత్సాహం చూపుతున్న యువత

రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. కొన్ని ఏళ్లుగా పల్లెల్లో మార్పు కోసం ఎంతగానో ఎదురుచూసిన నాయకులు మాత్రం ఎలాంటి మార్పు చేయకపోవడంతో నాయకుల పట్ల యువత నిరాశ చెందారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో మార్పు రావాలనే దృక్పథంతో హుస్నాబాద్ నియోజకవర్గంలో గ్రామాలను అభివృద్ధి చేయాలనే పట్టుదలతో కొత్త ఆలోచనలతో యువత ముందుకు వస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో యువతపై ప్రభావం ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News December 2, 2025
తాళ్లరేవులో ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ప్రపోజల్

విమాన సర్వీసుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కింజరాపు రామ్మోహననాయుడును అమలాపురం ఎంపీ గంటి హరీశ్ బాలయోగి కోరారు. ఢిల్లీలోని మంత్రి కార్యాలయంలో ఆయనను హరీశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని తాళ్లరేవు కోరింగ గ్రామంలో నూతన విమానాశ్రయం నిర్మాణానికి సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని కోరారు.
News December 2, 2025
నల్గొండ: రేపు మూడో విడత నోటిఫికేషన్

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడత నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. ఇప్పటికే NLG, CDR డివిజన్లలో మొదటి విడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా, రెండో విడత MLG డివిజన్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై మంగళవారంతో ముగియనుంది. మూడో విడత దేవరకొండ డివిజన్‌కు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 3న ఎన్నికల అధికారి విడుదల చేయనున్నారు. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
News December 2, 2025
గొర్రెలకు సంపూర్ణాహారం అందకపోతే జరిగేది ఇదే

గొర్రెలకు సరైన పోషకాహారం అందకుంటే పెరుగుదల లోపించి త్వరగా బరువు పెరగవు. వ్యాధి నిరోధక శక్తి తగ్గి సులభంగా వ్యాధుల బారిన పడతాయి. అంతర, బాహ్య పరాన్న జీవుల కారణంగా గొర్రెలకు వ్యాధుల ముప్పు పెరుగుతుంది. గొర్రెల ఉన్ని రాలిపోతుంది. పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. గర్భస్రావాలు, పిల్లలు తక్కువ బరువుతో, బలహీనంగా జన్మించడం, సకాలంలో ఎదకు రాకపోవడం, ఈతల మధ్య వ్యవధి పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.


