News November 1, 2025

సిద్దిపేట: చేతులు మారుతున్న వైన్స్ !

image

సిద్దిపేటలో కొత్త వైన్స్ చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. వైన్స్ టెండర్ 2025-27లో లక్కీడ్రా ద్వారా షాపులు దక్కినవారి చుట్టూ పలువురు వ్యాపారాలు ప్రదక్షిణలు చేస్తున్నారు. టెండర్‌లో జిల్లాకు చెందిన కొందరికి అసలే దక్కకపోగా, మరి కొందరు 30-45 టెండర్లు వేస్తే 3-4 దక్కాయి. దీంతో షాపులు దక్కనివారు గుడ్ విల్ ఇచ్చి తీసుకునేందుకు కోట్లలో ఆఫర్ ఇస్తున్నట్టు టాక్. గజ్వేల్లో ఓ షాపుకు రూ.1.4 కోట్ల ఆఫర్ ఇచ్చారట.

Similar News

News November 2, 2025

లండన్ పర్యటనలో CM చంద్రబాబు దంపతులు

image

AP: CM చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి లండన్‌ పర్యటనకు వెళ్లారు. ఈనెల 5 వరకు ఈ వ్యక్తిగత పర్యటన కొనసాగనుంది. ఈనెల 4న భువనేశ్వరి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును అందుకోనున్నారు. గతంలో ఈ అవార్డును అబ్దుల్ కలాం, రాజశ్రీ బిర్లా అందుకున్నారు. హెరిటేజ్ ఫుడ్స్‌ తరఫున గోల్డెన్ పీకాక్ పురస్కారాన్నీ స్వీకరించనున్నారు. అనంతరం CM చంద్రబాబు పలువురు పారిశ్రామికవేత్తలను CII సదస్సుకు ఆహ్వానిస్తారు.

News November 2, 2025

పాలమూరు: చెప్పుల కోసం పోతే.. ఊపిరి పోయింది!

image

ఉప్పునుంతల మండలం దాసర్లపల్లికి చెందిన మల్కేడి శంకర్‌జీ (45) ప్రమాదవశాత్తు వాగులో మునిగి మృతిచెందాడు. శనివారం ఆయన బైక్‌పై దాసర్లపల్లి నుంచి మామిళ్లపల్లికి వెళ్తుండగా, చిలుకల వాగు వంతెన దాటే క్రమంలో ఈ ఘటన జరిగింది. భారీ వర్షాల కారణంగా వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా, తన పాదరక్షలు నీటిలో కొట్టుకుపోవడంతో, వాటిని తీసే ప్రయత్నంలో కాలు జారి పడిపోయాడు.

News November 2, 2025

NRPT: బాల రక్షణ భవనంలో డ్రైవర్ ఉద్యోగం

image

నారాయణపేట జిల్లా పరిధిలోని బాల రక్షణ భవనం వాహనం నడుపుటకు ఆసక్తి, అర్హత ఉన్న డ్రైవర్లు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి, అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు టెన్త్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, అనుభవం సర్టిఫికెట్ తదితర పత్రాలతో ఈ నెల 7 లోపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.