News November 12, 2025
సిద్దిపేట: దయ జూపరా మాపై కొడుకా!

అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన వృద్ధ దంపతులు మిట్టపల్లి వెంకటయ్య, లక్ష్మి తమ ఇద్దరు కుమారులు బాగోగులు చూసుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాము కష్టపడి సంపాదించిన 8 ఎకరాల భూమిని ఇద్దరికీ రెండు భాగాలుగా పంచి ఇచ్చినప్పటికీ ఎవరు కూడా చూడడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తిండి పెట్టాలని అడిగినందుకు కొట్టి, కాళ్లు విరగొట్టారని తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆర్డీవోకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News November 12, 2025
2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు: CM

AP: ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేది తమ లక్ష్యమని CM చంద్రబాబు తెలిపారు. 2029 నాటికి దీనిని సాకారమయ్యేలా చూస్తామన్నారు. అన్నమయ్య(D) దేవగుడిపల్లిలో 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలకు ఆయన శ్రీకారం చుట్టారు. మిగతా ఇళ్లు కూడా పూర్తి చేసి ఉగాది నాటికి గృహప్రవేశాలు చేయిస్తామన్నారు. YCP హయాంలో 4 లక్షలకు పైగా ఇళ్లను రద్దు చేశారని, ఇళ్లకు ఇవ్వాల్సిన రూ.900కోట్లను ఎగ్గొట్టారని విమర్శించారు.
News November 12, 2025
సోషల్ మీడియా అకౌంట్లకు తల్లిదండ్రుల అనుమతి

మైనర్లు సోషల్ మీడియా ఖాతాలను ఓపెన్ చెయ్యడానికి వారి తల్లిదండ్రుల అనుమతి (వెరిఫయబుల్ కన్‌సెంట్) ఉండాలని కేంద్ర సమాచారశాఖ విడుదల చేసిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) చట్టముసాయిదాలో నిబంధన చేర్చారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే తల్లిదండ్రులు/ గార్డియన్ అనుమతి ఉంటేనే మైనర్లు సోషల్ మీడియా, ఈ-కామర్స్, గేమింగ్ యాప్‌లు వాడాలి. దివ్యాంగులకు కూడా గార్డియన్ సమ్మతి ఉండాలని చెబుతున్నారు.
News November 12, 2025
నల్గొండకు మరో అరుదైన గౌరవం

ప్రాంతీయ అభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ (S&T) ఆధారిత పరిష్కారాలను రూపొందించడంలో చురుకుగా ఉన్న నల్గొండ జిల్లా యంత్రాంగానికి అరుదైన ఆహ్వానం లభించింది. కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు (PSA) కార్యాలయం ఢిల్లీలో డిసెంబర్‌లో నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు హాజరు కావాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. ‘S&T క్లస్టర్స్: మేకింగ్ లైవ్స్ ఈజియర్’ అంశంపై జరిగే ఈ సదస్సు ఆహ్వానం కలెక్టర్‌కు అందింది.


