News November 12, 2025

సిద్దిపేట: యువ వ్యాపారవేత్త సూసైడ్

image

అప్పుల భారాన్ని తట్టుకోలేక యువ వ్యాపారవేత్త ఆత్మహత్య చేసుకున్న ఘటన అక్బర్పేట భూంపల్లి మండల పరిధిలోని మోతేలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రాజు (35) జీవనోపాధి కోసం దుబ్బాకలో బ్యాంగిల్ స్టోర్ నడుపుతున్నాడు. భార్య, ఇద్దరు చిన్న కుమారులు ఉన్నారు. మంగళవారం మోతే గ్రామంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 12, 2025

రెండో రోజు కొనసాగుతున్న సిట్ విచారణ

image

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మాజీ ఈవో ధర్మారెడ్డిని రెండో రోజు సిట్ విచారిస్తోంది. ఉదయం 8.30 గంటలకు అలిపిరి సమీపంలోని సిట్ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. మంగళవారం జరిగిన విచారణలో అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడంతో తిరిగి వాటిని అడిగే అవకాశం ఉంది.

News November 12, 2025

బ్యాంకుకు ‘లంచ్ బ్రేక్’ ఉంటుందా?

image

బ్యాంకు సర్వీస్‌లో లంచ్ బ్రేక్ ఉండదు. RBI ప్రకారం పబ్లిక్, ప్రైవేట్ లేదా కోఆపరేటివ్ బ్యాంకుల్లో లంచ్ కోసం ఫిక్స్‌డ్ టైమ్ లేదు. భోజన సమయంలో కౌంటర్లన్నీ మూసివేయకూడదు. లంచ్‌ సమయంలోనూ ఎవరో ఒకరు రొటేషనల్ పద్ధతిలో కస్టమర్లకు సేవలు అందించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు లంచ్ బ్రేక్‌ పేరుతో ఇబ్బంది పడితే RBI కస్టమర్‌ కేర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఒకప్పుడు బ్యాంకుల్లో ఈ లంచ్ బ్రేక్ ఉండేది. SHARE

News November 12, 2025

దర్శనాల నిలిపివేత పై మరికాసేపట్లో అధికారిక ప్రకటన

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తులకు దర్శనం నిలిపివేయడంపై ఆలయ అధికారులు మరికాసేపట్లో అధికారికంగా ప్రకటన విడుదల చేయనున్నారు. అభివృద్ధి పనుల కోసం నెల రోజుల కిందనే దర్శనాలు నిలిపివేయాలని నిర్ణయించినప్పటికీ హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు తీవ్ర వ్యతిరేకత తెలపడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఈ క్రమంలో ముందస్తు సమాచారం లేకుండా బుధవారం తెల్లవారుజాము నుండి దర్శనాలు నిలిపివేశారు.