News November 14, 2025
సిరిసిల్ల: గైనకాలజిస్ట్ పోస్ట్ వెంటనే భర్తీ చేయాలి: కలెక్టర్

సిరిసిల్ల ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఖాళీగా ఉన్న గైనకాలజిస్ట్ పోస్టును వెంటనే భర్తీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ప్రవీణ్ కుమార్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, డీఎంహెచ్ఓ రజిత పాల్గొన్నారు.
Similar News
News November 14, 2025
మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ముందు ఉండి పని చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. డివిజన్ల వారీగా హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జీ మంత్రిగా ప్రతి ఒక్కరినీ సమన్వయం చేసుకుంటూ నవీన్ యాదవ్ గెలుపునకు కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, రోహిన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
News November 14, 2025
అన్నమయ్య: 20 ఎర్రచందనం దుంగలు.. ఇన్నోవా సీజ్

అన్నమయ్య జిల్లాలోని శేషచలం అడవుల్లో అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న స్మగ్లర్లపై అటవీ సిబ్బంది దాడి చేశారు. ఈ ఘటన వీరబల్లి మండలం తాటిగుంటపల్లి సమీపంలో శుక్రవారం జరిగింది. కాగా పోలీసులు ఆపరేషన్ నిర్వహించి 20 ఎర్రచందనం దుంగలు, ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లు పరారయ్యారని రేంజర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. దుంగలు, వాహనం విలువ సుమారు రూ.10లక్షలు ఉంటుందని రేంజర్ తెలిపారు.
News November 14, 2025
‘క్రెడిట్’ రాజకీయం.. BRS ఓటమికి కీలక కారణం?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బాధ్యత KTRకు అప్పగించడం కొంతమంది ముఖ్య నేతలకు మింగుడు పడలేదని టాక్. గెలిస్తే ఆయనకు క్రెడిట్ దక్కుతుందని దూరంగా ఉన్నట్లు సమాచారం. గ్రేటర్ MLAలు ఆయనతో కలిసి రాలేదని కొంతమంది శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అటు హరీశ్ రావు తన తండ్రి మరణంతో ఏమీ చేయలేకపోయారు. ఇక కిందిస్థాయి కేడర్‌ను కవిత కంట్రోల్ చేసినట్లు తెలుస్తోంది. అంతాకలిసి అంటీముట్టనట్టుగా వ్యవహరించారు.


