News February 27, 2025
సిరిసిల్ల: నేడే పోలింగ్.. అంతా రెడీ!

నేడు జరగనున్న KNR, MDK, ADB, NZB పట్టభద్రుల, టీచర్ MLC ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. జిల్లాలో పట్టభద్రులు 22,397, ఉఫాధ్యాయులు 950 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 41 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టభద్రుల బరిలో 56 మంది, ఉపాధ్యాయుల స్థానంలో 15 మంది ఉండగా.. ఎవరు విజేతగా నిలుస్తారో మార్చి 3వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే. 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
Similar News
News February 27, 2025
సిరిసిల్ల: పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

సిరిసిల్ల పట్టణంలోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గీత నగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలోని పోలింగ్ కేంద్రాలను సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం సందర్శించారు. పోలింగ్ సరళి ఎలా జరుగుతుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ శాతం రిపోర్టు ఎప్పటికప్పుడు అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
News February 27, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలింగ్ శాతం వివరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు పట్టభద్రులు 22,397 మంది (5.2 శాతం), ఉపాధ్యాయులు 950 మంది (11.52 )శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తున్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
News February 27, 2025
స్టూడెంట్స్ బుక్స్‌లో ₹3.5కోట్లు.. ట్విస్ట్ ఏంటంటే!

పుణే ఎయిర్‌పోర్టులో భారీ హవాలా రాకెట్ బయటపడింది. ముగ్గురు స్టూడెంట్స్ దుబాయ్ వెళ్లేందుకు ట్రావెల్ ఏజెంట్ ఖుష్బూ అగర్వాల్ వద్ద టికెట్లు బుక్ చేసుకున్నారు. ఫ్లయిట్ ఎక్కే 2hrs ముందు వారికామె 2 బ్యాగుల్లో బుక్స్ పెట్టి దుబాయ్‌లోని తమ బ్రాంచ్‌లో ఇవ్వమన్నారు. విషయం తెలుసుకున్న కస్టమ్స్ అధికారులు వారిని అక్కడి నుంచి మళ్లీ పుణేకి రప్పించారు. చెక్ చేసి బుక్స్‌లోని $4L (Rs 3.5CR)ను స్వాధీనం చేసుకున్నారు.