News November 1, 2025

సిరిసిల్ల: ‘ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోండి’

image

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న ఆరోగ్య పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని రాజన్నసిరిసిల్ల జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్ రజిత సూచించారు. శనివారం సిరిసిల్లలోని అంబేడ్కర్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని రికార్డులను, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. టీకాలు నిల్వఉంచే కోల్డ్ చైన్ రికార్డులను నిశితంగా తనిఖీచేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

Similar News

News November 2, 2025

పోలీసుల అదుపులో జోగి రమేశ్ అనుచరుడు

image

AP: సిట్, ఎక్సైజ్ అధికారులు <<18174864>>జోగి రమేశ్<<>> ఇంటికి వచ్చారన్న సమాచారంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో అధికారులతో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో ఆ ప్రాంతమంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు జోగి రమేశ్ అనుచరుడు ఆరేపల్లి రామును పోలీసులు అదుపులోకి తీసుకొని విజయవాడలోని సిట్ ఆఫీసుకు తరలించారు. కాసేపట్లో పూర్తి వివరాలు తెలియనున్నాయి.

News November 2, 2025

ప్రెగ్నెన్సీ నిలవాలంటే..

image

కొంతమందికి పుట్టుకతోనే సెర్విక్స్‌ వీక్‌గా ఉంటుంది. దీనివల్ల గర్భస్థ శిశువు బరువు పెరిగే కొద్ది మోయలేక గర్భస్రావం అవుతుంది. దీన్ని సెర్వైకల్‌ ఇన్‌కంపిటెన్స్‌ అంటారు. అలా అయితే ట్రాన్స్‌వెజైనల్‌ సర్‌క్లేజ్‌ అంటే వెజైనాలోంచి సెర్విక్స్‌ దగ్గర టేప్‌తో కుట్లు వేస్తారు. కొన్నిసార్లు ట్రాన్స్‌అబ్డామినల్‌ అప్రోచ్‌ అంటే ప్రెగ్నెన్సీకి ముందు లేదా 3వ నెలలో పొట్టను ఓపెన్‌ చేసి సెర్విక్స్‌కి కుట్లు వేస్తారు.

News November 2, 2025

సెర్వైకల్‌ ఇన్‌కంపిటెన్స్‌ చికిత్స ఇలా..

image

సెర్వైకల్‌ ఇన్‌కంపిటెన్స్‌ ఉంటే రెండవ నెలలో రక్త, మూత్ర పరీక్షలు చేయించుకొని యూరిన్‌/ వెజైనాలో ఇన్ఫెక్షన్‌ లేదని నిర్ధారణ చేసుకోండి. వయబిలిటీ స్కాన్‌ చేస్తారు. సెర్విక్స్‌కి కుట్లు వేయాల్సివస్తే అవి ఏ టైమ్‌లో వేయాలో నిర్ధారించుకుంటారు. లాపరోస్కోపిక్‌ సెర్వైకల్‌ సర్‌క్లేజ్‌కి ప్లాన్‌ చేస్తారు. దీనివల్ల 89 శాతం మందిలో గర్భం నిలబడి బిడ్డను కనొచ్చు. ఈ ప్రక్రియను అనుభవజ్ఞులైన డాక్టర్లు నిర్వహించాలి.