News November 2, 2025
సీటు కేటాయిస్తే చదువుకుంటా సారు..!

ఆదోని KGBV పాఠశాలలో చదువుతూ చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న సోగునూరుకు చెందిన నివేదితను ఎమ్మిగనూరు KGBVకు తల్లితండ్రులు DEO రెఫర్ ద్వారా మార్చుకున్నారు. అయితే DEO ఆదేశాలను లెక్కచేయని GCDO నివేదిత చదువుకు ఆటంకం కలిగిస్తోంది. YGRలో సీటు ఇవ్వాలని ప్రాధేయపడినా ఆమె చలించలేదు. ప్రస్తుతం బాలికను తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలకు తీసుకెళుతున్నారు. సీటు కేటాయిస్తే చదువుకుంటానని బాలిక తెలిపింది.
Similar News
News November 2, 2025
కామారెడ్డిలో రేపు ప్రజావాణి

కామారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు అధికారులు ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జిల్లా ప్రజలకు సూచించారు.
News November 2, 2025
సన్నబియ్యంలో కేంద్రం వాటా రూ.42, రాష్ట్రానిది రూ.15: కిషన్ రెడ్డి

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే సన్నబియ్యం రద్దవుతాయని సీఎం రేవంత్ ప్రజలను బెదిరిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి బెదిరింపు రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. సన్నబియ్యం స్కీమ్ కేంద్రానిదని, కేజీకి మోదీ సర్కారు రూ.42 ఇస్తే, రాష్ట్రం వాటా రూ.15 మాత్రమే అని పేర్కొన్నారు.
News November 2, 2025
ప్రేమ వివాహం.. పోలీస్ స్టేషన్‌లో హాజరైన యువతి

రామసముద్రం పోలీస్ స్టేషన్‌లో నమోదైన యువతి మిస్సింగ్ కేసులో సస్పెన్స్‌కు తెరపడింది. తిరుమల రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అరవింద్‌తో ప్రేమ వివాహం చేసుకున్న ఆమె స్వయంగా పోలీస్ స్టేషన్‌కు హాజరైనట్లు SI రమేష్ బాబు తెలిపారు. అమ్మాయి మేజర్ కావడంతో MRO సమక్షంలో వీడియో, రాతపూర్వకంగా ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు SI పేర్కొన్నారు.


