News November 12, 2025
సూర్యాపేట: బయటపడ్డ కాకతీయ కాలం నాటి శివలింగం

తిరుమలగిరి మండలం అనంతారం గ్రామంలో 11వ శతాబ్దం నాటి కాకతీయుల కాలం నాటి శివలింగం, ఆంజనేయస్వామి విగ్రహాలు బయటపడ్డాయి. అది సోమసూత్ర శివలింగమని గ్రామస్థులు తెలిపారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ శివాలయం పక్కనే అనంతారం గ్రామం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో శివభక్తులు పాల్గొని శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు.
Similar News
News November 12, 2025
రాజన్న దర్శనాలు మరోవారమైన కొనసాగించాల్సింది..!

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనాలు ఈరోజు ఉదయం నుంచి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజన్నకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం మరో వారంలో పూర్తికానుంది. భక్తులు కార్తీక దీపారాధన చేసుకోవడానికి అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో రాజన్న దర్శనాలు మరో వారం పాటు కొనసాగించాలని భక్తులు కోరుతున్నారు.
News November 12, 2025
ఉగ్రకుట్ర ప్రధాన సూత్రధారి ఇతడే..!

ఫరీదాబాద్ ఉగ్రమూలాల కేసులో ప్రధాన సూత్రధారి ఇటీవల జమ్మూలో అరెస్టైన ఇమామ్ ఇర్ఫాన్ అహ్మదేనని తేలింది. జైషే మహ్మద్ నుంచి ప్రేరణ పొందిన అతడు ఫరీదాబాద్‌లోని వైద్య విద్యార్థులకు బ్రెయిన్ వాష్ చేశాడు. వారిని పూర్తిగా ఉగ్రవాదం వైపు నడిపించడమే లక్ష్యంగా తరచూ జైషే వీడియోలు చూపించాడు. ఢిల్లీ పేలుడులో అనుమానితుడు డా.ఉమర్, ఇప్పటికే అరెస్టైన డా.ముజమ్మిల్, డా.షాహిన్ ఇతడి కంట్రోల్‌లోనే ఉన్నట్లు సమాచారం.
News November 12, 2025
HYD: పాలమూర్ ఆగ్రో కాంప్లెక్స్ డైరెక్టర్ ఎస్.రమేశ్ రెడ్డి అరెస్ట్

HYDలోని పాలమూర్ ఆగ్రో కాంప్లెక్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఎస్.రమేశ్ రెడ్డిని SFIO అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని పాలమూర్ ఆగ్రో కాంప్లెక్స్ లిమిటెడ్‌లో ప్రమోటర్లకు తెలియకుండా నకిలీ డాక్యుమెంట్ల, సంతకాలతో సంస్థకు చెందిన 100 ఎకరాల భూమి (విలువ రూ.300 కోట్లు)ను విక్రయించినట్లు ఆరోపించారు. కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌పై చర్య తీసుకున్న అధికారులు రమేశ్‌ను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.


