News December 8, 2025
హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదు : పోలీసుల హెచ్చరిక

తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు డిసెంబర్ 15 నుంచి No Helmet–No Petrol నిబంధన కఠినంగా అమలు చేయనున్నట్లు పోలీసులు ప్రకటించారు. దేశంలో రోడ్డు ప్రమాదాల్లో 45% మరణాలు బైకుల నిర్లక్ష్యంతో జరుగుతుండగా, హెల్మెట్ వాడితే 40% ప్రాణాలు నిలుస్తాయని గణాంకాలు చెబుతున్నాయి. అందువల్ల వాహనం నడుపుతున్నవారు, వెనుక కూర్చునే వారు ఇద్దరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.
Similar News
News December 9, 2025
తిరుపతి : TET అభ్యర్థులకు ALERT

టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) ఈనెల 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనుంది. తిరుపతి జిల్లా పరిధిలో 9, చెన్నై నందు 3 మొత్తం 12 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని తిరుపతి DEO KVN కుమార్ పేర్కొన్నారు. అభ్యర్థులకు సూచనలు చేశారు.
> పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని తెలిపారు.
> గుర్తింపు కార్డు వెంట తీసుకొని వెళ్లాలన్నారు.
> హాల్ టికెట్ లో ఫొటో సరిగ్గా లేకపోతే 2 ఫొటోలు అవసరం అన్నారు.
News December 9, 2025
ఆదిలాబాద్: ఈరోజు సాయంత్రం నుంచి మైకులు బంద్

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, సిరికొండ, గాదిగూడ, ఇంద్రవెల్లి, ఉట్నూరు, నార్నూరు మండలాల్లోని 166 పంచాయతీలకు మొదటి విడతలో భాగంగా 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం గడువు నేటి సాయంత్రంతో ముగియనుంది. దీంతో అభ్యర్థులు, వారి బంధువులు గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ తమకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఎక్కడా సమయం వృథా చేయకుండా ప్రతి ఓటరును కలుస్తూ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
News December 9, 2025
ప్రకాశం: గుండెల్ని పిండేసే దృశ్యం.!

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని పెంచికలపాడు వద్ద సోమవారం 2 లారీలు ఢీకొని వ్యక్తి లారీలోనే <<18508533>>సజీవ దహనమయ్యాడు.<<>> లారీలో ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందడంతో బయటకు రాలేక నిస్సహాయ స్థితిలో డ్రైవర్ అగ్నికి ఆహుతయ్యాడు. అప్రమత్తమైన అధికారులు మంటలను అదుపుచేసి వ్యక్తి శరీర భాగాలను అతి కష్టంమీద బయటకు తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం బేస్తవారిపేట ఆసుపత్రికి తరలించారు. ఫొటోలోని దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.


