News October 7, 2025
10 వీక్లీ స్పెషల్ ట్రైన్ల టర్మీనల్ మార్పు

తిరుపతి రైల్వే స్టేషన్ వరకు నడిచే పది ట్రైన్స్ టెర్మినల్స్‌ను దక్షిణ మధ్య రైల్వే మార్పు చేసింది. వీక్లీ స్పెషల్ కింద నడిచే పది ట్రైన్స్ తిరుచానూరు స్టేషన్ వరకు నడవనున్నాయి. 07609, 07610, 07251, 07252, 07015, 07016, 07009, 07010, 07017, 07018 ట్రైన్స్ ఇకపై తిరుచానూరు స్టేషన్ నుంచి నడవనున్నాయి.
Similar News
News January 23, 2026
అనంతపురం JNTU విద్యార్థులకు భారీ ప్యాకేజీతో ఉద్యోగాలు

అనంతపురం JNTU ఇంజినీరింగ్ కళాశాలలో Accenture కంపెనీ నిర్వహించిన ప్రాంగణ నియామకాలలో 11 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిలో ఆరుగురికి రూ.6.5 లక్షలు, ఐదుగురికి రూ.4.5లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు లభించినట్లు ప్లేస్‌మెంట్ ఆఫీసర్ శ్రీనివాసులు తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులను VC సుదర్శన రావు, ప్రిన్సిపల్ చెన్నారెడ్డి అభినందించారు. మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించడంపై కళాశాలలో హర్షం వ్యక్తమైంది.
News January 23, 2026
బాపట్ల: రూ.102 కోట్లతో 260 కొత్త ఆరోగ్య కేంద్రాలు

బాపట్ల పార్లమెంట్ పరిధిలో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు రూ.102.336 కోట్లతో 260 కొత్త ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి ఆమోదం లభించిందని గురువారం MP కృష్ణప్రసాద్ తెలిపారు. మంజూరైన వాటిలో 234 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, 18 బ్లాక్ హెల్త్ యూనిట్లు, 5 పీహెచ్‌సీలు, 1 క్రిటికల్ కేర్ బ్లాక్ ఉన్నాయని వివరించారు. పేదలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేయడమే లక్ష్యమని వెల్లడించారు.
News January 23, 2026
బందీలుగా ఉన్న మత్స్యకారులకు ఈనెల 29న విముక్తి

AP: బంగ్లాదేశ్ జైల్లో బందీలుగా ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులు ఈ నెల 29న విడుదల కానున్నారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ అధికారికంగా ప్రకటించింది. విడుదలయ్యే వారిలో విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది, పశ్చిమ బెంగాల్‌కు చెందిన 14 మంది ఉన్నారు. గత అక్టోబర్ 22న విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లి పొరపాటున బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించడంతో వీరు అరెస్టయ్యారు.


