News December 7, 2025
10 వేల గూడ్స్ లారీలను నిలిపివేస్తాం: యజమానుల సంఘం

AP: ఎల్లుండి (డిసెంబర్ 9) అర్ధరాత్రి నుంచి గూడ్స్ రవాణా నిలిపివేయాలని లారీ ఓనర్ల సంఘం నిర్ణయించింది. 13 ఏళ్లు దాటిన గూడ్స్ వాహనాలపై కేంద్రం పెంచిన టెస్టింగ్, ఫిట్‌నెస్ <<18452599>>ఛార్జీలను<<>> వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసింది. అదనపు ఫీజుల భారం సరుకు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. డిమాండ్లను పట్టించుకోకపోతే రైల్వే షెడ్లు, షిప్‌యార్డుల్లో 10 వేల గూడ్స్ లారీలను నిలిపివేస్తామని హెచ్చరించింది.
Similar News
News January 13, 2026
భోగి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి?

భోగి 13న, 14న అనే సందిగ్ధత నెలకొంది. అయితే హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది భోగి పండుగను జనవరి 14వ తేదీన జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ముందు రోజే భోగిగా భావిస్తారు. అదే రోజు తెల్లవారుజామున భోగి మంటలు వేయడం శుభంగా చెబుతున్నారు. దీంతోనే సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. తర్వాతి రోజు సంక్రాంతి కాగా జనవరి 16న కనుమ పండుగ ఉంటుంది.
News January 13, 2026
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో పోస్టులు

CSIR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (<
News January 13, 2026
ప్రెగ్నెన్సీలో ఈ లక్షణాలుంటే డేంజర్

ప్రెగ్నెన్సీ సమయంలో రక్తస్రావం ఎక్కువగా, గడ్డలు గడ్డలుగా కావడం, భరించలేని కడుపు/పొత్తి కడుపు నొప్పి, వికారం, అలసట, చలి, జ్వరం.. వంటి లక్షణాల్లో ఏ ఒక్కటి ఉన్నా వెంటనే వైద్య నిపుణుల్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిదంటున్నారు. తద్వారా దాని ప్రభావం ఇటు మీపై, అటు కడుపులోని బిడ్డపై పడకుండా ముందే జాగ్రత్తపడచ్చని చెబుతున్నారు.


