News November 14, 2025
10 ఉపఎన్నికలు వస్తే ఏం చేస్తారో చూద్దాం: KTR

TG: ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున ఎక్కడా తగ్గకుండా పోరాటం కొనసాగిస్తామని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ‘ప.బెంగాల్‌లో BJP నుంచి TMCలో చేరిన MLAపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. అక్కడ జరిగిందే ఇక్కడా జరుగుతుందని ఆశిస్తున్నాం. దేశమంతా ఒకటే రూల్ కదా. ఒక్క ఉపఎన్నికకే కాంగ్రెస్ నేతలు ఆపసోపాలు పడ్డారు. 10 ఉపఎన్నికలు వస్తే వాళ్లకు ముచ్చెమటలు పడతాయేమో. ఏం చేస్తారో చూద్దాం’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News November 14, 2025
డబ్బుల పంపిణీతోనే ‘జూబ్లీ’లో కాంగ్రెస్ గెలుపు: కిషన్‌రెడ్డి

TG: దేశ ప్రజలు కాంగ్రెస్‌కు మంగళం పాడేశారని బిహార్ ఎన్నికల ఫలితాలు తేల్చాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. SIRను వ్యతిరేకిస్తున్న రాహుల్ వాదనను ప్రజలు తోసిపుచ్చారన్నారు. ECIకి ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్‌లో తామెన్నడూ గెలవలేదని, ఉపఎన్నికలో కాంగ్రెస్ డబ్బులతో గెలిచిందని విమర్శించారు. EVMలపై ఆరోపణలు చేస్తున్న రాహుల్ ‘జూబ్లీ’ గెలుపుపై సమాధానం చెప్పాలన్నారు.
News November 14, 2025
ఫలించని రాహుల్ యాత్ర.. అన్నింటా వెనుకంజ!

‘ఓటర్ అధికార్ యాత్ర’ పేరుతో ఇటీవల బిహార్‌లోని 25 జిల్లాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించారు. ఇందులో 110 నియోజకవర్గాలను కవర్ చేశారు. ఓట్ చోరీ పేరుతో విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ ఆయన పర్యటించిన ఏ ఒక్క చోటా కాంగ్రెస్ ఆధిక్యంలోకి రాలేదు. ఇటీవల రాహుల్ ప్రచారం చేసిన సీట్లలోనూ దాదాపు ఇదే పరిస్థితి. ప్రస్తుతం కేవలం 2 సీట్లలోనే కాంగ్రెస్ లీడ్‌లో ఉండటం గమనార్హం.
News November 14, 2025
APPLY NOW: NIPHMలో ఉద్యోగాలు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ (<


