News February 7, 2025

100% పన్నులు వసూలు చేయాలి: KMR కలెక్టర్

image

కామారెడ్డి జిల్లాలోని మున్సిపల్లో పన్నులను శత శాతం వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్‌లో మున్సిపల్ అధికారులు, సిబ్బందితో ఆస్తి పన్ను వసూళ్లు తదితర అంశాలపై గురువారం కలెక్టర్ సమీక్షించారు. మున్సిపల్ కమిషనర్‌లు పన్నుల వసూళ్లపై రోజువారీ బిల్ కలెక్టర్ల వారీగా సమీక్షించాలని అన్నారు. మున్సిపల్ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

Similar News

News February 13, 2026

సిద్దిపేట: మూడు మున్సిపాలిటీల్లో ‘గులాబీ’ జెండా రెపరెపలు

image

సిద్దిపేట జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తన కంచుకోటలను నిలబెట్టుకుంది. గజ్వేల్, చేర్యాల, దుబ్బాకలో స్పష్టమైన మెజారిటీ సాధించి పీఠాలను కైవసం చేసుకుంది. గజ్వేల్‌లో 11, చేర్యాలలో 7 స్థానాల్లో గెలిచి సత్తా చాటింది. హుస్నాబాద్‌లో మాత్రం కాంగ్రెస్ 16 సీట్లతో విజయదుందుభి మోగించింది. మారిన రాజకీయ సమీకరణాల్లోనూ బీఆర్‌ఎస్ 3 చోట్ల మ్యాజిక్ ఫిగర్ రావడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.

News February 13, 2026

కృష్ణా: పాఠశాలలకు రెండో శనివారం సెలవు రద్దు.!

image

కృష్ణా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు ప్రకటించిన రెండో శనివారం సెలవును జిల్లా విద్యాశాఖ అధికారులు అనూహ్యంగా రద్దు చేశారు. DEO సుబ్బారావు సర్క్యులర్ జారీ చేస్తూ, రేపు అన్ని ప్రభుత్వ పాఠశాలలు యథావిధిగా పనిచేయాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా జిల్లా పరిధిలోని MEO, DYEOలు తమ తమ మండలాల ప్రధానోపాధ్యాయులకు సమాచారాన్ని అందజేశారు.

News February 13, 2026

ఉట్నూర్: 4KGల గంజాయి స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్

image

నమ్మదగిన సమాచారంతో ఇంద్రవెల్లి పోలీసులు శ్మశానవాటిక వద్ద నిఘా ఉంచి గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కొడప రమేష్, కుంర గంగారం, కుముర కృష్ణల వద్ద నుంచి 4కిలోల గంజాయి, మోటార్ సైకిల్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను ఉట్నూర్ కోర్టులో రిమాండ్ చేసినట్లు ఎస్ఐ సాయన్న వెల్లడించారు.