News April 30, 2024

10TH రిజల్ట్స్.. ఉమ్మడి ఆదిలాబాద్‌లో 35,369 మంది

image

పదోతరగతి ఫలితాలు నేడు ఉదయం 11గంటలకు వెలువడనున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 10,405 మంది రెగ్యులర్,106 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారు. ఇందులో 5192 మంది బాలురు, 5213 మంది బాలికలు ఉన్నారు. నిర్మల్ జిల్లాలో 8,923 , మంచిర్యాల జిల్లాలో 9298 , ఆసిఫాబాద్ జిల్లాలో 6637 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. అందరి కంటే ముందుగా రిజల్ట్స్‌ను Way2News యాప్‌లో సులభంగా, వేగంగా పొందవచ్చు.

Similar News

News December 17, 2025

ఆదిలాబాద్ జిల్లాలో 54.45 శాతం నమోదు

image

ఆదిలాబాద్ జిల్లాలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 54.45 శాతం సరాసరి ఓటింగ్ నమోదైందని జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ తెలిపారు. బజార్హత్నూర్‌లో 53.57%, బోథ్ 47.73%, గుడిహత్నూర్ 58.11%, నేరడిగొండ 50.94%, సోనాల 55.56%, తలమడుగులో 61.19% నమోదైంది. ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు.

News December 17, 2025

గుడిహత్నూర్: స్కూటీపై వచ్చి ఓటేసిన 85 ఏళ్ల బామ్మ

image

గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఓ 85 ఏళ్ల బామ్మ ప్రజాస్వామ్యంపై తనకున్న మక్కువను చాటుకున్నారు. వయసు భారంతో ఉన్న శారీరక ఇబ్బందులను లెక్కచేయకుండా, ఆమె స్వయంగా స్కూటీపై పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమె స్ఫూర్తిని చూసి స్థానికులు, ఎన్నికల సిబ్బంది అభినందనలు తెలిపారు. ఓటు హక్కు ప్రాముఖ్యంపై ఆమె అందరికీ ఆదర్శంగా నిలిచారని అధికారులు పేర్కొన్నారు.

News December 17, 2025

ఆదిలాబాద్: పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌: ఎస్పీ

image

పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రజలు అనవసరంగా గుమిగూడరాదని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ (144 సెక్షన్‌) అమలులో ఉంటుందన్నారు. 100 మీటర్లు, 200 మీటర్ల దూరంలో ప్రత్యేక నియమ నిబంధనలు ఉంటాయని, వాటిని తప్పక పాటించాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, వాటర్‌ బాటిళ్లు, ఆయుధాలు, పెన్నులు వంటి వాటికి అనుమతి లేదన్నారు. క్యూ లైన్‌ పద్ధతి పాటించాలని ఎస్పీ పేర్కొన్నారు.