News April 23, 2025

10th RESULTS: ఏడో స్థానంలో విజయనగరం జిల్లా

image

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో విజయనగరం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 22,777 మంది పరీక్ష రాయగా 19,824 మంది పాసయ్యారు. 11,413 మంది బాలురులో 9.748(85.41%) మంది, 11,364 మంది బాలికలు పరీక్ష రాయగా 10,076(88.67%) మంది పాసయ్యారు. 87.04% పాస్ పర్సంటైల్‌తో రాష్ట్రంలో విజయనగరం జిల్లా ఏడో స్థానంలో నిలిచింది.

Similar News

News March 16, 2026

VZM: నేడే పదవ తరగతి పరీక్షలు

image

నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలోని 119 కేంద్రాల్లో 23,529 విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉ.9:30 నుంచి మ.12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. హాల్ టికెట్‌పై సంబంధిత స్కూల్ ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా అనుమతించనున్నట్లు వెల్లడించారు. హాల్ టికెట్ చూపించి పల్లె వెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. సందేహాలు ఉంటే 7382157686 ఫోన్ చేయవచ్చు. ఆల్ ది బెస్ట్.

News March 16, 2026

భోగాపురం కనెక్టివిటీ రోడ్ల క్లియరెన్సుకు సీఎం ఆదేశం: మంత్రి నారాయణ

image

భోగాపురం కనెక్టివిటీ రోడ్లకు అటవీ శాఖ నుంచి క్లియరెన్సులు ఇవ్వాలని సీఎం ఆదేశించారని మంత్రి నారాయణ వెల్లడించారు. విశాఖలో మెట్రో రైలు నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. మెట్రో ప్రాజెక్టుపై మరోసారి సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కేంద్రం కోరిందని, రైటర్స్ సంస్థకు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. ఆలస్యం లేకుండా టెండర్ల ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు.