News April 24, 2024
10th RESULTS.. చిత్తూరు జిల్లాకు 6వ స్థానం

టెన్త్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా 91.28% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 6 స్థానంలో నిలిచింది. 20,939 మందికి 19113 మంది పాసయ్యారు. 10793 మంది బాలురకు 9596 మంది, 10146 మంది బాలికలకు 9517 మంది పాసయ్యారు. తిరుపతి జిల్లాలో 26625 మందికి 24151 మంది పాసయ్యారు. 90.71 శాతంతో పదో స్థానంలో నిలిచింది. 13997 మంది బాలురకు 12538 మంది, 12628 మంది బాలికలకు 11613 మంది పాసయ్యారు.
Similar News
News December 12, 2025
చిత్తూరు: 2.22 లక్షల మందికి పోలియో చుక్కలు

ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలు వేసేలా అధికారులు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని చిత్తూరు డీఆర్వో మోహన్ కుమార్ సూచించారు. జిల్లా సచివాలయంలో పల్స్ పోలియో సమావేశం శుక్రవారం నిర్వహించారు. డిసెంబర్ 21న పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లాలో 2.22 లక్షల మంది చిన్నారులు ఉన్నారని, వీరికి 142 రూట్లలో 5,794 బూత్‌ల పరిధిలో చుక్కలు వేయనున్నట్లు చెప్పారు.
News December 12, 2025
ఫోన్ నంబర్ల బోర్డులు పెట్టండి: చిత్తూరు కలెక్టర్

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. రోడ్డు భద్రతా కమిటీ సమావేశం కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆ ప్రదేశాల్లో ఆసుపత్రులు, డాక్టర్ల ఫోను నెంబర్ల వివరాలు తెలిపే బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. వివిధ హైవేల్లో చేపట్టాల్సిన చర్యలను వివరించారు.
News December 12, 2025
పుంగనూరు: జిల్లాలో నేటి టమాటా ధరలు

చిత్తూరు జిల్లాలో టమాట ధరలు శుక్రవారం ఇలా ఉన్నాయి. పుంగనూరు వ్యవసాయ మార్కెట్లో నాణ్యత కలిగిన మొదటి రకం టమాటాలు గరిష్ఠంగా 10 కిలోలు రూ. 320, పలమనేరు మార్కెట్ లో రూ.310, వీకోట మార్కెట్ లో రూ. 300 వరకు పలికాయి. మూడు మార్కెట్లకు కలిపి 94 మెట్రిక్ టన్నుల కాయలు రైతులు తీసుకు వచ్చినట్లు అధికారులు చెప్పారు.


