News December 1, 2025
11 పరీక్ష కేంద్రాల్లో.. 2,412 విద్యార్థులు: కలెక్టర్

జిల్లాలోని బాపట్ల, చీరాల, రేపల్లె రెవెన్యూ డివిజన్ల పరిధిలో మొత్తం 11 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షలకు 2,412 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షా నిర్వహణ కోసం ఫ్లయింగ్ స్క్వాడ్స్, చీఫ్ సూపరింటెండెంట్లు, రూట్ అధికారులు, కస్టోడియళ్లను నియమించాలన్నారు. ప్రతి కేంద్రంలో ఏఎన్‌ఎంలను నియమించామని తెలిపారు.
Similar News
News February 13, 2026
శ్రీవారి విషయంలో తప్పు చేయను: చంద్రబాబు

AP: తిరుమల శ్రీవారి విషయంలో తెలిసి కానీ, తెలియకుండా కానీ ఏ తప్పు చేయనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వేంకటేశ్వరస్వామి రాష్ట్రంలో ఉండటం మన అదృష్టమన్నారు. ఆయనను తలుచుకుంటే హాయిగా నిద్ర వస్తుందని పేర్కొన్నారు. తిరుమల లడ్డూ సున్నితమైన అంశమని, దానిపై ఎక్కువ మాట్లాడకూడదనుకున్నానని చెప్పారు. అయితే కొంత మంది కావాలనే భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని అసెంబ్లీలో మండిపడ్డారు.
News February 13, 2026
BREAKING.. పరకాల మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే!

పరకాల మున్సిపాలిటీ కాంగ్రెస్ దక్కించుకుంది. హోరాహోరీగా సాగిన పోరులో కాంగ్రెస్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. వరుసగా రెండు, మూడో రౌండ్లలో కాంగ్రెస్ సత్తా చాటింది. ఫస్ట్ రౌండ్లో 2 వార్డులు, రెండో రౌండ్లు 5 వార్డులు, మూడో రౌండ్లో 4 వార్డులు దక్కించుకుంది. మొత్తం 22 వార్డుల్లో ఇంకా రెండు వార్డుల లెక్కింపు మిగిలి ఉండగానే.. ఛైర్మన్ పీఠానికి కావాల్సిన 11 వార్డులను కైవసం చేసుకుంది.
News February 13, 2026
సమస్యలు తీరే వరకు నా పోస్టులు ఆగవు: కొలికపూడి

తిరువూరు నియోజకవర్గంలో రోడ్లు, కనీస వసతుల లేమిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే నా లక్ష్యమని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. “నేను అవినీతి చేయను, చేయనివ్వను. ప్రజల కోసం వేసే వాట్సాప్ స్టేటస్‌లు, ట్వీట్లు కొనసాగుతాయి. నాకు ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవు” అని ఆయన పేర్కొన్నారు. సుపరిపాలనలో తిరువూరును అగ్రస్థానంలో నిలుపుతానని అసెంబ్లీ లాబీల్లో మీడియా చిట్‌చాట్‌లో వెల్లడించారు.


