News July 3, 2024
121 మంది మృతి.. భోలే బాబాపై నో కేస్!

హాథ్రస్‌లో భోలే బాబా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సభలో తొక్కిసలాట జరిగి 121 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై కేసు నమోదు కాగా అందులో భోలే బాబా పేరును ప్రస్తావించలేదని తెలుస్తోంది. ఈవెంట్ ఆర్గనైజర్‌పై మాత్రమే పోలీసులు కేసు నమోదు చేశారట. సభకు 80వేల మందికి మాత్రమే అనుమతి ఇవ్వగా 2.5 లక్షల మందికి పైగా హాజరయ్యారని FIRలో పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Similar News
News December 5, 2025
డే అండ్ నైట్ టెస్టుల్లో WORLD RECORD

ఆసీస్-ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ హోరాహోరీగా కొనసాగుతోంది. ఈ క్రమంలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. రెండో టెస్టు రెండో రోజు ఇరు జట్లు 7 వికెట్లు కోల్పోయి 387 రన్స్(Aus-378/6, Eng-9/1) చేశాయి. డే అండ్ నైట్ టెస్టుల్లో ఒక రోజులో నమోదైన అత్యధిక స్కోర్ ఇదే. 2019లో AUS-PAK 383/8 స్కోర్ చేశాయి. అలాగే ఇవాళ ఆసీస్ చేసిన 378 పరుగులు.. DN టెస్టులో ఒక టీమ్ ఒక రోజులో చేసిన అత్యధిక స్కోర్ కావడం విశేషం.
News December 5, 2025
పిల్లలు సినిమాల పిచ్చిలో పడకూడదు: పవన్

AP: సినిమాలు వినోదంలో ఓ భాగం మాత్రమేనని Dy.CM పవన్ కళ్యాణ్ అన్నారు. పిల్లలు ఆ సినిమాల పిచ్చిలో పడకుండా చూడాలని PTMలో పేరెంట్స్‌కి సూచించారు. గతంలో చదువుల కోసం దాతలు వందల ఎకరాలు దానమిచ్చారని గుర్తు చేశారు. నేడు ఉన్న స్థలాలు దోచుకుపోయే పరిస్థితి ఉందని, స్కూళ్లకు గ్రౌండ్స్ లేకపోవడం విచారకరమన్నారు. ‘సోషల్ టీచర్ చెప్పిన పాఠాలు నా గుండెలో నాటుకుపోయాయి. అవే నాలో సామాజిక బాధ్యతను పెంచాయి’ అని అన్నారు.
News December 5, 2025
వేప పిండి, పిడకల ఎరువుతో ప్రయోజనాలు

☛ ఒక టన్ను వేప పిండిని దుక్కిలో(లేదా) పంట పెట్టిన తర్వాత వేస్తే 52 నుంచి 55KGల నత్రజని, 10KGల భాస్వరం, 14-15KGల పొటాష్ ఇతర పోషకాలు పంటకు అందుతాయి.
☛ బాగా పొడిచేసిన పిడకల ఎరువు(36-40 బస్తాలు)ను సాగు భూమిలో వేస్తే 5-15KGల నత్రజని, 3-9KGల భాస్వరం, 5-19KGల పొటాష్ ఇతర పోషకాలు పంటకు అందుతాయి. వేపపిండిలోని పోషకాల శాతం భూమికి అదనపు బలాన్నిచ్చి, చీడపీడలు, తెగుళ్ల ముప్పును తగ్గిస్తుంది.


