News November 14, 2025

13 వస్తువులతో త్వరలోనే బేబీ కిట్లు!

image

AP: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులకు త్వరలోనే ఎన్టీఆర్‌ బేబీ కిట్లు అందనున్నాయి. జోన్ల వారీగా వేర్వేరు సంస్థలకు కిట్ల సరఫరా బాధ్యతలు అప్పగించనున్నారు. టెండరులో 4 బిడ్లు రాగా మూడింటిని ఖరారు చేసినట్లు సమాచారం. సంవత్సరానికి 3.50 లక్షల మందికి ఈ కిట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కిట్‌లో బ్యాగు, దోమతెర, ఫోల్డబుల్‌ బెడ్ సహా మొత్తం 13 రకాల వస్తువులు ఉండనున్నాయి.

Similar News

News November 14, 2025

ఒకేరోజు ఓటీటీలోకి వచ్చేసిన 3 సినిమాలు

image

ఇవాళ ఏకంగా మూడు సినిమాలు ఒకే OTTలోకి వచ్చేశాయి. సిద్ధు, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి నటించిన ‘తెలుసు కదా’, ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘డ్యూడ్’, ధ్రువ్ విక్రమ్, అనుపమ పరమేశ్వర్ కలిసి నటించిన ‘బైసన్’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. విడుదలైన నెల రోజుల‌లోపే ఈ చిత్రాలు స్ట్రీమింగ్‌కు రావడం గమనార్హం.

News November 14, 2025

ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో మొదలయ్యాయి. నిఫ్టీ 70 పాయింట్ల నష్టంతో 25,807 వద్ద, సెన్సెక్స్ 241 పాయింట్లు కోల్పోయి 84,237 వద్ద కొనసాగుతున్నాయి. మెటల్, ఐటీ, ఆటో, FMCG స్టాక్స్ ఎరుపెక్కాయి. ముత్తూట్ ఫిన్ కార్ప్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ లాభాల్లో ఉండగా, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, ఎయిర్‌టెల్, ఐటీసీ, ఇన్ఫీ, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

News November 14, 2025

BRSకు స్వల్ప ఆధిక్యం

image

జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడో రౌండ్‌లోని ఒక EVMలో BRSకు స్వల్ప ఆధిక్యం వచ్చింది. మూడో రౌండ్‌లో ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, రహమత్ నగర్ ఓట్లను లెక్కించారు. అటు ఇప్పటివరకు 3 రౌండ్లలో కలిపి చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ లీడ్‌లో ఉంది.