News March 10, 2025

ITBP స్పోర్ట్స్ కోటాలో 133 ఉద్యోగాలు

image

ITBP స్పోర్ట్స్ కోటాలో 133 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అథ్లెటిక్స్, స్విమ్మింగ్, షూటింగ్, బాక్సింగ్, కబడ్డీ, తదితర క్రీడా విభాగాల్లో 3/4/2023 నుంచి 2/4/2025 వరకు నోటిఫికేషన్‌లోని పేరా (4)Dలో పేర్కొన్న క్రీడల్లో మెడల్స్ సాధించి ఉండాలి. ఈ నెల 4న ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల 4 వరకు అందుబాటులో ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News January 18, 2026

గిరిజన సంస్కృతికి నిలువుటద్దం ‘నాగోబా జాతర’

image

ADB(D) కేస్లాపూర్(V)లో గిరిజనులు నాగోబా జాతరను అత్యంత భక్తితో జరుపుకొంటారు. పుష్యమాస అమావాస్య రోజున తమ ఆరాధ్య దైవం నాగోబా నాట్యం చేస్తాడని మెస్రం వంశీయుల నమ్మకం. ఈ పండుగ కోసం గిరిజనులు 100km నడిచి గోదావరి జలాన్ని కలశాల్లో తెస్తారు. అమావాస్య అర్థరాత్రి ఆ పవిత్ర జలంతో స్వామికి అభిషేకం చేయడంతో జాతర ప్రారంభమవుతుంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వేడుకకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షల మంది తరలివస్తారు.

News January 18, 2026

శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

AP: శ్రీకాకుళం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ 4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి టెన్త్, డిగ్రీ, కంప్యూటర్ నాలెడ్జ్‌తో పాటు పని అనుభవం గలవారు JAN 27 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18- 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, వైవా వోస్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PwBDలకు రూ.500. వెబ్‌సైట్: srikakulam.dcourts.gov.in/

News January 18, 2026

రాజకీయం ఇప్పుడే మొదలైంది: శివసేన(UBT)

image

ముంబై మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ‘రిసార్ట్ రాజకీయం’ మొదలైన తరుణంలో శివసేన (UBT) కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చాయి. అసలైన రాజకీయం ఇప్పుడే మొదలవుతుంది’ అని సామ్నా ఎడిటోరియల్‌లో పేర్కొంది. ముంబైకి ఇప్పటివరకు 23 మంది మరాఠీ మేయర్లను అందించిన సంప్రదాయం కొనసాగుతుందా అని ప్రశ్నించింది. మేయర్ ఎంపిక విషయంలో CM ఫడణవీస్, Dy.CM షిండే మధ్య అంతర్గత పోరు నడుస్తోందని రాసుకొచ్చింది.