News December 10, 2024
14, 15వ తేదీలలో వైవీయూ రెండో దశ అంతర కళాశాలల క్రీడా పోటీలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1733753578554_51967295-normal-WIFI.webp)
వైవీయూ అంతర్ కళాశాలల పురుషులు మహిళల క్రీడా పోటీలు ప్రొద్దుటూరు డా.వైఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 14, 15 తేదిల్లో నిర్వహించనున్నట్లు క్రీడా బోర్డు కార్యదర్శి డా.కె. రామసుబ్బారెడ్డి తెలిపారు. పురుషులు మహిళలకువాలీబాల్, కబడ్డీ, టగ్ ఆఫ్ వార్ పోటీలు ఉంటాయన్నారు. ఈ క్రీడల్లో పాల్గొనేవారు ఈ ఏడాది జులై 1వ తేదీ నాటికి 17 – 25 సంవత్సరాల మధ్య ఉండాలన్నారు. వైవీయూ అనుబంధ కళాశాలలో చదువుతూ ఉండాలని తెలిపారు.
Similar News
News January 19, 2025
మస్కట్‌లో కడప వ్యక్తి మృతి.. స్పందించిన లోకేశ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737290122407_1042-normal-WIFI.webp)
కడప బిస్మిల్లా నగర్‌కు చెందిన షేక్ మొహమ్మద్ అనీష్ అన్సారీ ఉపాధి నిమిత్తం మస్కట్ వెళ్లి గుండెపోటుతో మరణించాడు. మృతదేహాన్ని తెప్పించేందుకు సాయం చేయాలని SM ద్వారా ఓ వ్యక్తి మంత్రి లోకేశ్‌కు విన్నవించుకున్నారు. స్పందించిన లోకేశ్ ‘జీవనోపాధి కోసం మస్కట్ వెళ్లిన అన్సారీ మృతి చెందటం అత్యంత బాధాకరం. వారిని స్వదేశానికి రప్పించేందుకు సాధ్యమైన ఏర్పాట్లు చేస్తాం. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలి అని’ అన్నారు.
News January 19, 2025
గోల్డ్ మెడల్ సాధించిన కడప జిల్లా బిడ్డ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737267028365_52003684-normal-WIFI.webp)
బ్రహ్మంగారి మఠానికి చెందిన చిత్రాల జెస్సీ అంతర్జాతీయ పోటీల్లో జంప్ రోప్ ఛాంపియన్ షిప్‌లో బంగారు పతకం సాధించింది. నేపాల్ అంతర్జాతీయ పోటీల్లో ఏపీ తరఫున పాల్గొంది. అత్యుత్తమ ప్రతిభ కనపరిచి గోల్డ్ మెడల్‌ను సాధించిన ఆమెను అందరూ అభినందిస్తున్నారు. జెస్సీ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.
News January 19, 2025
29 నుంచి దేవుని కడప వార్షిక బ్రహ్మోత్సవాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737251731304_52218543-normal-WIFI.webp)
ఈనెల 29 నుంచి తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు దేవుని కడప వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనుండగా, 28న సాయంత్రం అంకురార్పణ, 29న ఉదయం 9.30 గంటలకు ధ్వజారోహణం ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఫిబ్రవరి 3న స్వామి వారి కళ్యాణం, 4న వైభవంగా రథోత్సవం, ఫిబ్రవరి 7న పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.