News May 11, 2024

144 సెక్షన్ షురూ

image

దేశంలో నాలుగో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో 144 సెక్షన్ అమలులోకి వచ్చింది. బల్క్ SMSలు సైతం పంపించవద్దని ఈసీ సూచించింది. నియోజకవర్గాల్లో స్థానికేతరులు ఉండవద్దని ఆదేశించింది. మే 13న పోలింగ్, జూన్ 4న ఫలితాలు రానుండగా.. జూన్ 1 సాయంత్రం 6.30గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం ఉంటుందని తెలిపింది. సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలు ఉంటాయని పేర్కొంది.

Similar News

News February 7, 2025

గురుకులాల్లో ప్రవేశాలు.. ముగిసిన దరఖాస్తు గడువు

image

TG: ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు నిన్నటితో ముగిసింది. 643 గురుకులాల్లో మొత్తం 51,968 సీట్లు ఉండగా, 1.67లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఐదో తరగతికే 88,824 అప్లికేషన్లు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈనెల 23న ప్రవేశ పరీక్ష నిర్వహించనుండగా, మే 15 నాటికి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసి జూన్ 12 నుంచి క్లాసులు ప్రారంభిస్తామని తెలిపారు.

News February 7, 2025

ఈ నెల 14న రాష్ట్ర బంద్: మాల మహానాడు

image

TG: ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇందుకు నిరసనగా ఈ నెల 14న రాష్ట్ర బంద్ నిర్వహించనున్నట్లు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, మాల మహానాడు ప్రకటించాయి. మాలలను అణచివేసేందుకు ప్రధాని మోదీ, సీఎం రేవంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, MRPS నేత మందకృష్ణ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డాయి.

News February 7, 2025

విద్యుత్ డిమాండ్.. తెలంగాణ చరిత్రలోనే అత్యధికం

image

TG: రాష్ట్ర రోజువారీ విద్యుత్ డిమాండ్ విషయంలో సరికొత్త రికార్డు నమోదైంది. తెలంగాణ చరిత్రలోనే అత్యధికంగా గురువారం(FEB 6) 15,752 మెగావాట్లుగా నమోదైనట్లు ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్ తెలిపారు. 2024 మార్చి 8న రోజువారీ డిమాండ్ అత్యధికంగా 15,623 మెగావాట్లు నమోదుకాగా ఈసారి ఫిబ్రవరిలోనే అది బ్రేకయ్యింది. ఎండల నేపథ్యంలో రబీ సాగు, ఇళ్లు, పరిశ్రమల్లో కరెంటు వినియోగం పెరగడమే దీనికి కారణం.

error: Content is protected !!