News December 1, 2025
146కి చేరిన హాంకాంగ్ మృతుల సంఖ్య

హాంకాంగ్ <<18408814>>అగ్ని ప్రమాదం<<>>లో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా 18 మృతదేహాలను వెలికితీయడంతో మొత్తం మృతుల సంఖ్య 146కి చేరింది. 100 మంది ఆచూకీ తెలియరాలేదని, 79 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. భారీ మంటల వల్ల శరీరాలు కాలిపోయి మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితికి చేరాయి. ప్రమాదం జరిగిన అన్ని బిల్డింగ్‌లలో సహాయక చర్యలు పూర్తయ్యే సరికి మూడు నుంచి నాలుగు వారాలు పట్టొచ్చని పోలీసులు తెలిపారు.
Similar News
News February 18, 2026
2027లో అల్లు అర్జున్ నుంచి రెండు సినిమాలు?

అల్లు అర్జున్ వచ్చే ఏడాది 2 సినిమాలతో బాక్సాఫీసును షేక్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అట్లీ డైరెక్షన్‌లో చేస్తున్న AA22 సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ ఏడాదిలోనే లోకేశ్ కనగరాజ్ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కానున్నట్లు మైత్రి సంస్థ తాజాగా ప్రకటించింది. AA, లోకేశ్ కలిసి తీసుకున్న సెల్ఫీని షేర్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలు 2027లోనే రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
News February 18, 2026
ప్రభుత్వ ఆఫీసులలో AC ఉష్ణోగ్రతపై పరిమితి

TG: ప్రభుత్వ ఆఫీసులలో ACలను కనిష్ఠంగా 25డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మాత్రమే వినియోగించాలని ప్రభుత్వం పరిమితి విధించింది. ఇంధన పొదుపుతో పాటు బిల్లుల భారాన్ని తగ్గించేందుకు ఈ ఆదేశాలు ఇచ్చింది. దీన్ని తప్పనిసరిగా అమలు చేయాలని పేర్కొంది. ఇప్పటికే ఆఫీసులు, స్కీముల విద్యుత్ బిల్లులు కొండల్లా పేరుకుపోయాయి. కొన్నేళ్లుగా డిస్కమ్‌లకు వీటి నుంచి రావాల్సిన బకాయి ₹48వేల CR వరకు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
News February 18, 2026
ఆశా వర్కర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

AP: పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 14 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి DMHO దరఖాస్తులు కోరుతోంది. టెన్త్ అర్హతతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగిన మహిళలు ఫిబ్రవరి 20వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ప్రొవిజినల్ లిస్ట్‌ను ఫిబ్రవరి 23న ప్రకటిస్తారు. వయసు 25నుంచి 45 ఏళ్ల మధ్య ఉండి, స్థానికంగా నివాసం ఉండాలి. వెబ్‌సైట్: https://allurisitharamaraju.ap.gov.in/


