News November 30, 2024

15 ఏళ్ల క్రితం సెంట్రల్ జైలులో ఉన్నా: KTR

image

మాజీ మంత్రి, MLA KTR తన గతాన్ని గుర్తు చేసుకుంటూ శనివారం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘15 ఏళ్ల క్రితం ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొని నవంబర్ 29న అరెస్ట్ అయ్యా. నన్ను వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో జరిగిన ఈ ఘటన నాకు జీవితాంతం గుర్తుంటుంది. ప్రజల శ్రేయస్సు కోసమే నిత్యం కృషి చేస్తాను’ అని KTR ‘X’లో పోస్ట్ చేశారు.

Similar News

News December 11, 2024

జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ గ్రౌండ్‌లో గ్రాండ్‌గా క్రిస్మస్ వేడుకలు

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్‌నగర్ డివిజన్ పరిధిలోని SPR హిల్స్‌లో కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఆద్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. మంత్రి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంత పెద్ద ఎత్తున క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన సీఎన్ రెడ్డిని మంత్రి అభినందించారు.

News December 11, 2024

ఉత్తమ అసెంబ్లీ పర్సన్ అవార్డు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం: స్పీకర్

image

ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు మాదిరిగా ఉత్తమ అసెంబ్లీ పర్సన్ అవార్డు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. బుధవారం ఎంసీఆర్‌‌హెచ్‌ఆర్‌‌డీఐలో జరిగిన శాసన మండలి, శాసన సభ సభ్యుల ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్టీఆర్, వెంకయ్య నాయుడు, వైఎస్సార్ వంటి గొప్ప వ్యక్తులు బాగా మాట్లాడి గొప్ప పేరు తెచ్చుకున్నారని తెలిపారు.

News December 11, 2024

17న HYDకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక

image

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది నేపథ్యంలో HYD రానున్న దృష్ట్యా జిల్లాలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ కోరారు. శీతాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు ఉంటారని వివరించారు. జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, మల్కాజిగిరి, కీసర ఆర్డీవోలు శ్యాంప్రకాష్, సైదులు, ఎసీపీ రాములు పాల్గొన్నారు.