News April 21, 2024
25 రోజుల్లో రూ.150 కోట్ల కలెక్షన్లు

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన చిత్రం ‘ఆడుజీవితం(ది గోట్ లైఫ్)’. ఈ సినిమా విడుదలైన 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
Similar News
News December 17, 2025
కౌలు రైతులకు రూ.లక్ష రుణం, ఎవరికి రాదు?

AP: ప్రభుత్వం భూమి లేని పేదలకు వ్యవసాయం కోసం ఇచ్చే దారకస్తు భూమి(DKT), అసైన్డ్ భూములు సాగు చేస్తూ కౌలు పత్రం ఉన్నవారు ఈ రుణానికి అనర్హులు. అలాగే సాగు చేసే భూమి ఎకరా కంటే తక్కువ ఉండకూడదు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పరిధిలో నివాసం లేని వారు, సభ్యత్వం లేని వారికి రుణం రాదు. సొంత ఇల్లు ఉన్నవారికే రుణాల మంజూరులో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. త్వరలో ఈ నిబంధనలపై పూర్తి క్లారిటీ రానుంది.
News December 17, 2025
మొబైల్ ఫోన్లు కొనేవారికి షాక్!

వచ్చే ఏడాది స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం మొబైల్ ర్యామ్ కంటే AI సర్వర్ల చిప్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. హైఎండ్ DRAM వంటి కాంపోనెంట్స్ వాడటంతో ఫోన్ల ధరలూ పెరగొచ్చు. ఫోన్లలో 16GB RAM వేరియంట్లు కనుమరుగై గరిష్ఠంగా 12GBకే పరిమితం కావొచ్చు’ అని తెలిపారు. కాగా APPLE తన ఫోన్లపై ₹7వేలు, మిగతా కంపెనీలు ₹2వేల వరకూ పెంచనున్నాయి.
News December 17, 2025
ఈ రెండ్రోజులు శివారాధన చేస్తే?

శివారాధనకు నేడు(బుధ ప్రదోషం), రేపు(మాస శివరాత్రి) ఎంతో అనుకూలమని పండితులు చెబుతున్నారు. ఈరోజు సాయంత్రం బుధ ప్రదోష వ్రతం ఆచరించాలని సూచిస్తున్నారు. ఫలితంగా బుధుడి అనుగ్రహంతో పిల్లల్లో మానసిక సామర్థ్యం, వాక్పటిమ పెరుగుతాయని అంటున్నారు. మార్గశిర మాస శివరాత్రి రోజున చేసే శివ పూజలతో పాపాలు నశించి, కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం. ప్రదోష, శివరాత్రి పూజల విధానం, టైమింగ్స్ కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.


