News October 7, 2025

ఒకే వ్యక్తికి 1,638 క్రెడిట్ కార్డులు.. మీకు తెలుసా?

image

అత్యధిక(1,638) వాలిడ్ క్రెడిట్ కార్డులున్న వ్యక్తిగా భారత్‌కు చెందిన మనీశ్ ధామేజా పేరిట గిన్నిస్ వరల్డ్ రికార్డు ఉంది. తనకు క్రెడిట్ కార్డ్స్ ఇష్టమని, వాటి ద్వారా వచ్చే రివార్డ్స్, బెనిఫిట్స్ అద్భుతమని ఆయన పేర్కొన్నారు. పాత నోట్ల రద్దు సమయంలో అవి చాలా ఉపయోగపడ్డాయన్నారు. ఇదే కాకుండా 10L+ నాణేలు సేకరించిన గిన్నిస్ రికార్డు కూడా ఆయన సొంతం. కాగా ఓ వ్యక్తి దగ్గర ఎన్ని క్రెడిట్ కార్డులైనా ఉండవచ్చు.

Similar News

News January 23, 2026

ఫోన్ ట్యాపింగ్ నేరం కాదనేది ప్రజలు గుర్తించాలి: RS ప్రవీణ్

image

TG: ఫోన్ ట్యాపింగ్ నేరం కాదనేది ప్రజలు గుర్తించాలని BRS నేత RS ప్రవీణ్ కుమార్ చెప్పారు. ‘దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం ట్యాపింగ్ చేయడం సర్వసాధారణం. ఇలా చేయొచ్చని చట్టమే చెబుతోంది. ఫోన్లు, ఈమెయిల్స్ ట్యాపింగ్ చేస్తున్నామని గతంలో మన్మోహన్ పార్లమెంటులో చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో ట్యాపింగ్ జరుగుతున్నా ఎక్కడా చర్చ లేదు. దేశ భద్రతకు సంబంధించిన అంశాన్ని ఈ ప్రభుత్వం బజారున పడేసింది’ అని మండిపడ్డారు.

News January 23, 2026

వింతల ప్రపంచం.. గ్రీన్‌లాండ్ ప్రత్యేకతలివే

image

ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన గ్రీన్‌లాండ్‌లో 80% ప్రాంతం మంచుతోనే నిండి ఉంటుంది. కేవలం 56,000 జనాభా కలిగిన ఈ దేశంలో ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లడానికి రోడ్లు ఉండవు. పడవలే ప్రయాణ సాధనం. ఇక్కడి గాలి, నీరు ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైనవి. చెట్లు దాదాపుగా లేని ఈ గడ్డపై ప్రజలు మనుగడకు వేట, ఫిషింగ్‌పైనే ఆధారపడతారు. డెన్మార్క్, ఐస్‌లాండ్ నుంచి మాత్రమే చేరుకోగల ఈ దేశంలో అర్ధరాత్రి సూర్యుణ్ని చూడొచ్చు.

News January 23, 2026

జీ రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా TN అసెంబ్లీలో తీర్మానం

image

జీ రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేసిన రాష్ట్రాల జాబితాలో తమిళనాడు చేరింది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో సీఎం స్టాలిన్ తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించారు. ఉపాధి హామీ చట్టానికి మహాత్మాగాంధీ పేరు తీసేసి జీ రామ్ జీగా మార్చడాన్ని DMK వ్యతిరేకిస్తూ వస్తోంది. తాజాగా అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇప్పటికే పంజాబ్, TG ప్రభుత్వాలు ఈ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేసిన విషయం తెలిసిందే.