News February 8, 2025

17 మంది అభ్యర్థులు-23 సెట్ల నామినేషన్లు

image

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి నామినేషన్లు ఊబందుకున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 13 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 17 మంది అభ్యర్థులు 23 సెట్లు నామినేషన్లు వేశారు. ఈరోజు, రేపు సెలవు ఉండడంతో నామినేషన్‌కు 10న ఒక్క రోజే గడువు ఉంది.

Similar News

News February 17, 2026

ఈనెల 21న విశాఖ జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు

image

విశాఖ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన ఈనెల 21న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి 1 నుండి 7 వరకు గల స్థాయీ సంఘాల సమావేశాలు వేర్వేరు సమయాల్లో నిర్వహిస్తామని సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు సంబంధిత శాఖల అధికారులు ప్రగతి నివేదికలతో ఈ సమావేశాలకు హాజరుకావాలని ఆయన కోరారు.

News February 17, 2026

వనపర్తి: తొలి ఓసి మహిళా ఛైర్మన్ మాధవి రికార్డ్

image

వనపర్తి మున్సిపాలిటీకి ఈరోజు తొలి ఓసి మహిళా ఛైర్మన్‌గా ఎన్నికై వనపర్తి చరిత్రలో మిరిదొడ్డి మాధవి రికార్డ్ సృష్టించారు. తొలిసారి ఎన్నికల బరిలో దిగి కౌన్సిలర్‌గా విజయం సాధించడమే గాక ఛైర్మన్‌గా ఎన్నికై జాక్పాట్ కొట్టారు. గతంలో రిటైర్డ్ టీచర్ ప్రమీలమ్మ ఛైర్ పర్సన్‌గా ఎన్నిక కాగాఆమె బీసీ మహిళ కావడం విశేషం. ఆమెకు రాజకీయ నేపథ్యం ఉందని, రాజకీయాలకు కొత్తయిన మాధవి పాలన ఎలా ఉంటుందో చూడాలంటున్నారు.

News February 17, 2026

సంగారెడ్డి: జిల్లాలో మున్సిపల్ ఛైర్మన్లు వీరే!

image

సంగారెడ్డి జిల్లాలోని 9 మున్సిపాలిటీల ఛైర్మన్‌లను ఎన్నుకున్నారు. జహీరాబాద్, గడ్డపోతారం ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది.
నూతన మున్సిపల్ ఛైర్మన్లు
1. సంగారెడ్డి- వనిత
2. సదాశివపేట- అంజమ్మ
3. ఆందోలు జోగిపేట- కృష్ణారెడ్డి
4. నారాయణఖేడ్- నగేశ్ షెట్కార్
5. కోహిర్- అశోక్
6. గడ్డపోతారం- సుష్మ
7. గుమ్మడిదల- కుమార్ గౌడ్
8. ఇస్నాపూర్- సుమలత
9. జిన్నారం- జనార్ధన్