News September 10, 2025
171 మంది హాజరు.. 17 మందికి ఉద్యోగావకాశాలు

PDPL కలెక్టరేట్‌లో జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో జరిగిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. KNRకు చెందిన ఓ పెయింట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్వ్యూలో 171 మంది యువతీయువకులు పాల్గొనగా, 17 మందికి ఉద్యోగాలు లభించాయి. 10వ తరగతి నుంచి PG, బీటెక్, ITI వరకు విద్యార్హత ఉన్న విద్యార్థులు హాజరయ్యారు. యువత TASK శిక్షణ పొంది జాబ్ మేళాల్లో చురుకుగా పాల్గొనాలని ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు సూచించారు.
Similar News
News December 5, 2025
KNR: TALLY.. రిజిస్ట్రేషన్ల గడువు పొడిగింపు

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని TASK ఆఫీస్‌లో TALLY ERP 9 విత్ GSTలో శిక్షణ కోసం రిజిస్ట్రేషన్ల గడువును DEC 12 వరకు పొడిగించినట్లు టాస్క్ ప్రతినిధులు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు కరీంనగర్ IT టవర్ మొదటి అంతస్తులోని TASK కార్యాలయంలో సంప్రదించి రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. TALLY నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవారికి ఇది సువర్ణవకాశమని అన్నారు. అభ్యర్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News December 5, 2025
మీరు ఇలాగే అనుకుంటున్నారా?

మనం అనేక వ్రతాలను ఆచరిస్తాం. ఏదో ఒక రోజున మన కోరిక నెరవేరినప్పుడు, అది చివరి సారి చేసిన వ్రత ఫలితమే అనుకుంటాము. ఆ ఒక్క వ్రతాన్నే గొప్పదని భావిస్తాము. అంతకుముందు చేసిన వ్రతాల శక్తిని తక్కువగా అంచనా వేస్తాము. కానీ, ఈ విజయం అన్ని వ్రతాల సంచిత ఫలితమని గ్రహించాలి. ఒక దుంగ నూరవ దెబ్బకు పగిలితే, అందుకు మొదటి 99 దెబ్బలు ఎలా కారణమవుతాయో మనం చేసిన చిన్న చిన్న వ్రతాల ఫలితాలు కూడా అంతే. ఏ వ్రతం చిన్నది కాదు.
News December 5, 2025
కృష్ణా: మెగా PTM-3.0 కార్యక్రమానికి సర్వం సిద్ధం

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 2500లకు పైగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మెగా PTM-3.0 నిర్వహించనున్నారు. ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థుల ప్రగతిని తెలుసుకోనున్నారు. గతంలో మాదిరిగానే ఈసారీ భారీ స్పందన వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విజయవాడ గాంధీ హైస్కూల్‌కు దాతలు ఉచితంగా 6 లాప్‌టాప్‌లను అందించారు. జిల్లాలో ఈ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.


