News November 17, 2025
19న కడప జిల్లాకు సీఎం చంద్రబాబు..?

సీఎం చంద్రబాబు ఈనెల 19న కడప జిల్లాకు వస్తారని సమాచారం. కమలాపురం నియోజకవర్గ పరిధిలోని పెండ్లిమర్రి మండలంలో ఆయన రైతులతో సమావేశమవుతారు. పీఎం కిసాన్ నిధుల విడుదల తర్వాత క్షేత్రస్థాయిలో పొలాలను పరిశీలిస్తారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నేడు లేదా రేపు అధికారికంగా షెడ్యూల్ రానుంది.
Similar News
News January 21, 2026
ప్రొద్దుటూరులో నేడు బంగారం, వెండి ధరల వివరాలు

ప్రొద్దుటూరులో బుధవారం బంగారం, వెండి ధరల వివరాలు.
* బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.15,760
* బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.14,499
* వెండి 10 గ్రాముల ధర: రూ.3250
News January 21, 2026
కడప: పోలీసుల నిర్ణయాలు ఆచరణలోకి రావా.!

రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని పోలీసులు నో హెల్మెట్ – నో పెట్రోల్ అంటూ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. అంతే కాకుండా ఇటీవల రోడ్డు భద్రతా వారోత్సవాలు అంటూ బైక్ ర్యాలీలు చేపడుతున్నారు. వీరు మాత్రం హెల్మెట్ పెట్టుకొని ర్యాలీలు చేస్తుంటే.. పలు రాజకీయ, ప్రజా, కుల, మత సంఘాల నాయకులు హెల్మెట్ లేకుండా ర్యాలీలు చేస్తున్నారు. ఇలా ఉంటే అనుకున్న ఫలితాలు ఎలా వస్తాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.
News January 21, 2026
కడప: శ్రీరామ శోభాయాత్ర.. పాఠశాలలకు సెలవు

శ్రీరాముని శోభాయాత్ర సందర్భంగా కడప నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శంషుద్దీన్ పేర్కొన్నారు. ఈరోజు సాయంత్రం శ్రీరాముని కళ్యాణంతో పాటు రేపు ఉదయం నుంచి మహా శోభాయాత్ర కడప నగరంలోని అన్ని ప్రాంతంలో జరగనుంది. ఈ నేపథ్యంలో అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు అధికారులు తెలిపారు.


