News November 8, 2025

19 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

కొచ్చిలోని కస్టమ్స్ కమిషనర్ ఆఫీస్, రెవెన్యూ శాఖ 19 గ్రూప్-C కేడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిలో ట్రేడ్స్‌మన్, సీమ్యాన్, గ్రేసర్, సీనియర్ స్టోర్ కీపర్ పోస్టులు ఉన్నాయి. టెన్త్, ITI ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు డిసెంబర్ 15వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25ఏళ్లు. సీనియర్ స్టోర్ కీపర్ పోస్టుకు 30ఏళ్లు. వెబ్‌సైట్: taxinformation.cbic.gov.in/

Similar News

News January 18, 2026

మెరిసిన మంధాన.. RCB ఘన విజయం

image

WPL: ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో RCB 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ స్మృతి మంధాన(96), జార్జియా హాఫ్ సెంచరీ(54*)తో రాణించడంతో 167రన్స్ లక్ష్యాన్ని RCB సునాయాసంగా ఛేదించింది. DC బౌలర్లు ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. మారిజాన్‌, నందినీ శర్మలకు చెరో వికెట్ దక్కింది. ఢిల్లీ తరఫున షెఫాలీ వర్మ(62) ఒంటరి పోరాటం వృథా అయ్యింది. ఈ విజయంతో బెంగళూరు జట్టు 8 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది.

News January 18, 2026

రేపు మౌని అమావాస్య.. ఉదయమే ఇలా చేయండి

image

రేపు పవిత్రమైన ‘<<18871132>>మౌని అమావాస్య<<>>’. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి భూమాతకు నమస్కరించాలి. పుణ్యస్నానం ఆచరించాలి. ఉదయం సూర్య నమస్కారం చేయాలి. అనంతరం శ్రీహరి, మహాలక్ష్మీ, గంగామాతను పూజించాలి. ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. శివాలయానికి వెళ్లి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శివుడికి రుద్రాభిషేకం చేయాలి. రేపు మౌనవ్రతం చేయడం వల్ల పుణ్యం సిద్ధిస్తుంది.

News January 17, 2026

బీజేపీకి ఓటేస్తేనే అభివృద్ధి: బండి సంజయ్

image

TG: త్వరలో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘విజయ సంకల్ప సమావేశం’లో ఆయన మాట్లాడారు. అధికార కాంగ్రెస్‌కు ఓటేస్తే అభివృద్ధికి నయాపైసా రాదని, బీఆర్ఎస్‌కు వేస్తే వృథాయేనని వ్యాఖ్యానించారు. బీజేపీకి ఓటేస్తే కేంద్రం నుంచి నిధులు వస్తాయనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.