News January 24, 2025
విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912: భట్టి

TG: వేసవిలో పీక్ డిమాండ్ దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రజా భవన్‌లో ఎన్పీడీసీఎల్, ట్రాన్స్‌కో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 108 తరహాలో విద్యుత్ సరఫరాలో సమస్యలపై ఫిర్యాదుకు 1912ను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ వ్యవస్థ నిర్వహణకు ప్రభుత్వం అదనపు నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.
Similar News
News February 14, 2025
Good News: హోల్‌సేల్ రేట్లు తగ్గాయ్..

భారత టోకు ధరల ద్రవ్యోల్బణం (WPI) జనవరిలో 2.31 శాతానికి తగ్గింది. 2024 డిసెంబర్లో ఇది 2.37%. గత ఏడాది జనవరిలో ఇది 0.27 శాతమే కావడం గమనార్హం. ఆహార వస్తువుల ధరలు తగ్గడమే ఇందుకు కారణమని కామర్స్ మినిస్ట్రీ తెలిపింది. ఫుడ్ ప్రొడక్ట్స్, టెక్స్‌టైల్స్ తయారీ, క్రూడ్ పెట్రోల్, గ్యాస్ ధరలు మాత్రం పెరుగుతున్నట్టు పేర్కొంది. డిసెంబర్లో 8.89గా ఉన్న WPI ఫుడ్ ఇండెక్స్ విలువ జనవరిలో 7.47కు దిగొచ్చిందని తెలిపింది.
News February 14, 2025
అకౌంట్లోకి రూ.15,000.. రేపే లాస్ట్

కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి కేంద్ర ప్రభుత్వం ELI(ఎంప్లాయీస్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీం) అమలు చేస్తోంది. దీనికి అర్హత సాధించిన వారు ఫిబ్రవరి 15లోగా UAN యాక్టివేషన్, బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో సీడింగ్ తప్పనిసరిగా పూర్తి చేయాలి. అలా చేస్తే ఒక నెల జీతం(గరిష్ఠంగా ₹15000) 3 వాయిదాల్లో అందిస్తోంది. ఇది ఉద్యోగి ఖాతాలో జమ అవుతుంది. అయితే చాలామంది ఉద్యోగులు UAN యాక్టివేషన్, ఆధార్ సీడింగ్‌పై ఆసక్తి చూపడం లేదు.
News February 14, 2025
రాహుల్ కులమేంటో చెప్పండి: రఘునందన్

TG: ప్రధాని మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటూ సీఎం రేవంత్ చేసిన <<15461493>>వ్యాఖ్యలకు<<>> BJP MP రఘునందన్ రావు కౌంటరిచ్చారు. ముందు రాహుల్ గాంధీ కులమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ కులం OC నుంచి BCకి వచ్చిందని ఇప్పుడే కనిపెట్టినట్లు ఆయన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోదీ గురించి మాట్లాడే హక్కు రేవంత్‌కు లేదన్నారు. మోదీ క్యాబినెట్‌లో 19 మంది BCలు ఉంటే రేవంత్ మంత్రివర్గంలో ఇద్దరే ఉన్నారని గుర్తు చేశారు.