News April 1, 2024

1996: బ్యాలెట్ పేపర్ కాదు.. పుస్తకమే!

image

ప్రభుత్వంపై తమిళనాడు రైతులకు ఉన్న ఆగ్రహం 1996లో ఎన్నికల సంఘానికి పెద్ద పని పెట్టింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టగా ప్రభుత్వం స్పందించలేదు. దీంతో ఆ ఏడాది ఎన్నికల్లో ఈరోడ్ MP స్థానానికి 1,033 నామినేషన్లు వేశారు. పత్రికల మాదిరి అభ్యర్థుల పేర్లతో బ్యాలెట్ పుస్తకాలు ముద్రించాల్సి వచ్చింది. ఈ ఘటనతో సెక్యూరిటీ డిపాజిట్‌ని రూ.500 నుంచి రూ.10 వేలకు EC పెంచింది.
#ELECTIONS2024

Similar News

News February 18, 2026

పవన్ కళ్యాణ్‌ కాన్వాయ్‌కు ప్రమాదం

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఆయన్ను పికప్ చేసుకునేందుకు విశాఖలోని సిరిపురం నుంచి పెద్దవాల్తేరు వెళ్తుండగా కాన్వాయ్‌లోని ఓ వాహనం సడన్ బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో చివరి వాహనం దెబ్బతింది. ప్రమాద సమయంలో కాన్వాయ్‌లో పవన్ లేకపోవడం, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

News February 18, 2026

బ్యాటరీ రెంటల్ కార్లు.. ఏంటీ విధానం?

image

ఈ విధానంలో కస్టమర్ కేవలం కారే కొనుగోలు చేస్తాడు. బ్యాటరీ కాదు. బ్యాటరీని షోరూమ్ రెంట్‌కి ఇస్తుంది. నెలకు మినిమం అమౌంట్ డిపాజిట్ చేసుకుంటుంది. ఆపై ఎన్ని కి.మీ ఎక్కువ తిరిగితే దానికి ఎక్స్‌ట్రా ఛార్జ్ చేస్తుంది. కారు కొనుగోలు సమయంలో కస్టమర్‌పై అధిక భారం పడొద్దనే కంపెనీలు బ్యాటరీ రెంటల్ విధానాన్ని తీసుకొచ్చాయి. మార్కెట్లో ఇప్పటికే MG విండ్సర్ ఇలాగే రన్ అవుతుండగా తాజాగా మారుతీ <<19171974>>ఈ-విటారా<<>> వచ్చింది.

News February 18, 2026

పూజ పూర్తయ్యాక ఈ తప్పులు చేస్తున్నారా?

image

దైవానుగ్రహం కలగాలంటే పూజ సమయంలోనే కాదు, పూజ తర్వాత కూడా కొన్ని నియమాలు పాటించాలి. పూజ ముగిసిన వెంటనే కాళ్లు కడగకూడదు. ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతుంది. పూజ చేసిన రోజున మాంసం, మద్యానికి దూరంగా ఉండాలి. నైవేద్యాన్ని సమర్పించిన వెంటనే తీయకూడదు. కాసేపు అక్కడే ఉంచాలి. పూజలో, పూజానంతరం కోపతాపాలు మానాలి. ప్రశాంతంగా ఉంటే దైవశక్తి పెరుగుతుంది. ఈ చిన్న జాగ్రత్తలు మీ ఇంట్లో సానుకూలతను నింపుతాయి.