News November 8, 2025
2 నెలల్లో 2,717 మందిపై కేసు: SP

సెప్టెంబర్, అక్టోబరులో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన 2,182 మందిపై కేసులు నమోదు చేసినట్లు బాపట్ల SP ఉమామహేశ్వర్ శనివారం తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 535 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. మొత్తం 2,717 మందిపై కేసులు నమోదయ్యాయన్నారు. 4 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో 224 ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేసి, నిబంధనలు పాటించని 55 వాహనాలకు రూ.1,57,405ల నగదు జరిమానా విధించామన్నారు.
Similar News
News January 23, 2026
సహాయక పరికరాలకు దివ్యాంగుల దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం జిల్లాలోని అర్హులైన దివ్యాంగులు సహాయక పరికరాల కోసం ఈ నెల 30వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి వేల్పుల విజేత కోరారు. ఆసక్తి గలవారు సదరం సర్టిఫికేట్, ఆధార్ కార్డు తదితర ధ్రువపత్రాలతో ప్రభుత్వం సూచించిన వెబ్‌సైట్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లావ్యాప్తంగా ఉన్న దివ్యాంగులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News January 23, 2026
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలి: కలెక్టర్

అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. శుక్రవారం జాతీయ ఓటర్ల దినోత్సవంలో భాగంగా ఆయన కలెక్టరేట్ ప్రాంగణంలో ఉద్యోగుల అందరి చేత జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల నమోదు పెంచడం, ఓటు హక్కుపై అవగాహన కల్పించడం, యువతను ఓటరుగా నమోదుకై ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.
News January 23, 2026
కల్లూరు: గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రమాదం.. ఆప్డేట్

కల్లూరు మండలంలోని లింగాల సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవేపై శుక్రవారం <<18932335>>రోడ్డు <<>>ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఎస్ఐ హరిత వివరాల ప్రకారం.. ఏపీలోని చింతలపూడి మండలానికి చెందిన గట్టు రాంబాబు, కొమ్ము సాయి బైక్‌పై వెళ్తూ అదుపుతప్పి హైవే రైలింగ్‌ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెనుబల్లి ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


